
కై కలూరులో ఇసుక దుమారం
వేధింపులకు గురి చేస్తున్నారు
కై కలూరు: నిర్మాణాలకు ఇసుక తోలకం కై కలూరులో పెద్ద దుమారాన్ని లేపుతోంది. నియోజకవర్గంలో చావలిపాడు గ్రామంలో ప్రభుత్వ ఇసుక సరఫరా కేంద్రాన్ని ఇటీవల ప్రారంభించారు. ఇక్కడ ఇసుక టన్ను రూ.731కు విక్రయిస్తున్నారు. రవాణా చార్జీలు అదనం. ఇదే ఇసుకను ఇతర ప్రాంతాల రీచ్‌ల నుంచి రవాణా ఖర్చులు కలుపుకుని టన్ను రూ.650 నుంచి రూ.700కే రవాణా చేస్తున్నారు. ప్రభుత్వ రవాణా కేంద్రం నుంచి వచ్చే ఇసుకుకు రవాణా ఖర్చులు రూ.3000 నుంచి రూ.4,000 చెల్లించాల్సి వస్తుంది. ప్రభుత్వ ఇసుక సరఫరా నుంచి ఇసుక తీసుకోపోతే గుత్తేదారుల అనుమాయుల సిఫార్సుతో పలు నియోజకవర్గాల్లో అధికారులు ఇబ్బందులు పెడుతోన్నారని లారీ ఓనర్స్ అసోషియేషన్ ఆరోపిస్తోంది.
కలిదిండి మండలానికి చెందిన ఓ టిప్పర్ యజమాని రెండు రోజుల క్రితం ఆచంట ర్యాంప్ నుంచి 30 టన్నుల ఇసుకతో సొంత పనులకు ఇసుక తీసుకొస్తున్నాడు. కలిదిండి సెంటర్‌లో ఎస్సై వాహనాన్ని నిలుపుదల చేసి అధిక లోడుతో రావడంతో ఆ ఇసుకను ఏఎంసీ గోడౌన్‌లో దింపించి, వాహనాన్ని వదిలారు. దీంతో సదరు టిప్పర్ డ్రైవర్లు అందరూ ప్రభుత్వ స్టాక్ పాయింట్ నుంచి ఇసుక తీసుకోకుండా బయట నుంచి తీసుకురావడంతో టిప్పర్ల యజమానులను ఇబ్బందులు పెడుతున్నారని భావిస్తోన్నారు.
నిబంధనల అమలులో తారతమ్యం
నియోజకవర్గానికి ఒకటి చొప్పున స్టాక్ పాయింట్ నిర్వాహణ బాద్యతను ఏజన్సీకి అప్పగించారు. పోలీసుల నిబంధనల మేరకు 20 టన్నుల ఇసుక మాత్రమే తరలించాలని చెబుతున్నారు. కై కలూరు నియోజకవర్గంలో దాదాపు 200 టిప్పర్లు ఉన్నాయి. వాస్తవానికి యూనిట్ల లెక్కన టిప్పర్ల ఇసుక రవాణా జరుగుతుంది. 6 యూనిట్లు 25 టన్నులు, 8 యూనిట్లు 33 టన్నులు, 10 యూనిట్లు 40 టన్నులు టిప్పర్లతో తీసుకువచ్చే అవకాశం ఉంది. టిప్పర్లను కొనుగోలు చేసినప్పుడే ప్రత్యేకంగా ఇసుక ఎక్కువుగా తీసుకురాడడానికి ఎత్తు పెంచుతున్నారు. పోలీసుల నిబంధనలు ప్రభుత్వ ఇసుక రీచ్‌ల వద్ద వాహనాలకు కూడా వర్తింప చేయాలని పలువురు కోరుతున్నారు.
కలిదిండిలో నిలిచిన అధిక లోడుతో వస్తున్న టిప్పరు
కై కలూరు నియోజకవర్గం చావలిపాడు వద్ద ప్రభుత్వ ఇసుక సరఫరా కేంద్రం
వేధింపులకు గురిచేస్తున్నారు :
లారీ అసోషయేషన్ నాయకులు
కై కలూరు నియోజకవర్గానికి వెళ్ళే ఇసుక లారీలు బయట ప్రాంతాల నుంచి లోడ్ తీసుకురావద్దని, లోకల్‌గా ఉన్న ఇసుక స్టాక్ యార్డు నుంచి తోలుకోవాలని, డైరెక్ట్‌గా చెప్పకుండా ఇబ్బందులకు గురి చేస్తోన్నారు. ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నాం.
– రావూరి రాజా, లారీ ఓనర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు

కై కలూరులో ఇసుక దుమారం

కై కలూరులో ఇసుక దుమారం