
భర్తలదే పెత్తనం
కై కలూరు: మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని చెబుతున్నప్పటికీ భర్తల పెత్తనమే కనిపిస్తోంది. కై కలూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. ఆలపాడు సర్పంచ్ కొప్పుల కృష్ణకుమారికి బదులు ఆమె భర్త ఏడుకొండలు సమావేశానికి వచ్చాడు. సీతనపల్లి సర్పంచ్ సుండ్రు పద్మావతికి బదులు భర్త పాండురంగరావు హాజరయ్యారు. ఆలపాడు సర్పంచ్‌గా కొండలు మైకు పట్టుకుని ప్రతి మీటింగ్‌లో మాట్లాడుతున్నారు. ముందు వరసలో సైతం వీరే కూర్చుంటున్నారు. చివరకు రిజిస్ట్రార్‌లో భార్యల పేరిట వీరే సంతకాలు చేస్తున్నారు. తామరకొల్లు వైస్ ఎంపీపీ గంగుల వెంకట నరసమ్మ భర్త పోతురాజు మీటింగ్ హాలులో కూర్చున్నారు. మహిళా సర్పంచుల స్థానంలో భర్తలు హాజరవుతున్నా అధికారులు ప్రశ్నించడం లేదు. దీనిపై ఎంపీడీవో ఆర్.రాజబాబును ప్రశ్నించగా.. ఎన్నికై న ప్రజాప్రతినిధులు మాత్రమే సమావేశ హాలులోకి రావాలని.. వారి బంధువులకు అనుమతి లేదని.. ఇకపై జరిగే మండల పరిషత్ సమావేశాలకు ఇతరులు రాకుండా చర్యలు తీసుకుంటానని చెప్పారు.
కై కలూరు మండల పరిషత్ సమావేశంలో మహిళా సర్పంచుల స్థానంలో భర్తలు

భర్తలదే పెత్తనం