కానరాని స్వచ్ఛత | - | Sakshi
Sakshi News home page

కానరాని స్వచ్ఛత

Oct 10 2025 7:54 AM | Updated on Oct 10 2025 8:04 AM

అంగన్‌వాడీల్లో పరేషన్‌

భార్యను కడతేర్చిన భర్త

ఇదేనా.. స్వచ్ఛత?

న్యూస్‌రీల్‌

అంగన్‌వాడీల్లో పరేషన్‌
సకాలంలో సరకులు అందక అంగన్‌వాడీ చిన్నారులు, పాఠశాలల విద్యార్థులు చాలీచాలని ఆహారంతో, ఖాళీ కడుపులతో కాలం వెళ్లదీస్తున్నారు. IIలో u
చెత్త ఉండని రోడ్డు ఉండదు.. చిన్నపాటి వర్షం పడితే డ్రెయినేజీ మురుగు రోడ్లపై తాండవిస్తోంది.. ఇది జిల్లా కేంద్రం ఏలూరు నగర దుస్థితి. చింతలపూడి గ్రేడ్‌–3 మున్సిపాల్టీలో కనీసం పక్కా డ్రైనేజీ వ్యవస్థ, మున్సిపాల్టీకో డంపింగ్‌ యార్డు లేని పరిస్థితి. ఇక కై కలూరు, నూజివీడులో చెత్త సమస్యతో పాటు డ్రైనేజీ ఇబ్బందులు.. ఇది జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణ తీరు.

శురకవారం శ్రీ 10 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

సాక్షి ప్రతినిధి, ఏలూరు: చిన్నపాటి పంచాయతీ మొదలు ఏలూరు నగరపాలక సంస్థ వరకూ ఇదే తీరు. అసలే వర్షాకాలం ఆపై చిన్నపాటి వర్షం పడినా మురుగు నీరంతా రోడ్లపైనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర పేరుతో స్వచ్ఛత నిర్వహణకు హడావుడి చేయడం ఏటా అవార్డులు ఇచ్చుకుంటూ అంతా బాగుందని స్వయం ప్రకటనలు మినహా క్షేత్రస్థాయిలో పరిస్థితి అత్యంత అధ్వాన్నం.

క్షేత్రస్థాయిలో అధ్వానంగా..

పంచాయతీ మొదలు నగరపాలక సంస్థ వరకూ జనాభా ప్రతిపాదిక తీసుకుని 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా స్వచ్ఛాంధ్ర పేరుతో ఆయా స్థానిక సంస్థల్లో కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రధానంగా మురుగు కాల్వలు బాగు చేయటం, చెత్త తొలగించడం, దోమల నివారణకు చర్యలు తీసుకోవడం, కాలుష్యరహితం కోసం మొక్కలు పెంచడం, ప్రధాన డ్రైయిన్లు బాగుచేయడం నిర్వహించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభు త్వం ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించి వీధి వీధికి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరీ హడావుడి అయితే చేసింది కానీ పారిశుద్ధ్య పనులు, అభివృద్ధి పనులు ఎక్కడా నిర్వహించకపోవడంతో వర్షాకాలంలో సమస్యలు తీవ్రమయ్యాయి. ఉదాహరణకు ఏలూరు నగరపాలక సంస్థ ఆర్ధిక సంఘం నిధులతో డివైడర్లకు రంగులు వేయడం, ఇతరాత్ర ఆదాయం ఉండే అభివృద్ధి పనులు చేసుకోవడం మినహా మరేమీ పనులు నిర్వహించడం లేదు. దీంతో చిన్నపాటి వర్షం వస్తే ఆర్‌ఆర్‌పేట రహదారి, శనివారపుపేట కాజ్‌వే, పవరుపేట రైల్వేస్టేషన్‌ రోడ్డు, కొత్తపేట, జీజీహెచ్‌ రోడ్డు, అశోక్‌నగర్‌ ఇలా అనేక ప్రాంతాల్లో రోడ్లపై రోజులు తరబడి నీరు నిలిచే పరిస్థితి. ఇక పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. వాస్తవానికి నగరపాలక సంస్థ నిధుల్లో 30 శాతం వరకు శానిటేషన్‌ మెరుగుదలకు వినియోగించాల్సి ఉన్నా వినియోగిస్తున్నట్లు లెక్కలు చూపించినా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు.

పడకేసిన పారిశుద్ధ్యం

జంగారెడ్డిగూడెం, నూజివీడు మున్సిపాల్టీలతో పాటు చింతలపూడి నగర పంచాయతీ అలాగే మేజర్‌ గ్రామ పంచాయతీల్లోనూ పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసింది. గత మూడు నెలల వ్యవధిలో విషజ్వరాలు విజృంభించిన పరిస్థితి. జిల్లాలో 457 గ్రామ పంచాయతీల్లో 15వ ఆర్థిక సంఘం నిధులతో స్వచ్ఛ నిర్వహణ కార్యక్రమాలను అధికారులు మమ అనిపించే రీతిలో చేశారు. నిధులు కేటాయించకుండా రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చేయడం, ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌తో ప్రజల నుంచి స్పందన తెలుసుకుని అవార్డులు ఇవ్వడం మినహా మరేమి జిల్లాలో జరగడం లేదు. ఇదిలా ఉండగా జిల్లాలో అద్భుతంగా పరిస్థితులున్నాయంటూ రాష్ట్రస్థాయి లో 2 అవార్డులు, జిల్లా స్థాయిలో 51 అవార్డులను ఈనెల 6న ఇవ్వడం గమనార్హం.

అనుమానం పెనుభూతమై భార్యపై భర్త కత్తెరతో దాడి చేయగా ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన ఏలూరులో చోటుచేసుకుంది. IIలో u

జిల్లాలో బెస్ట్‌ స్వచ్ఛత గ్రీన్‌ అంబాసిడర్‌గా జీలుగుమిల్లి మండలం పి.అంకంపాలెంకు చెందిన ఎం.సూరమ్మకు, స్వచ్ఛత రెసిడెన్షియల్‌ స్కూల్‌ అవార్డు విప్పలపాడులోని ఏకలవ్య మోడ్రన్‌ స్కూల్‌కు కేటాయించారు. జిల్లాస్థాయిలో అయితే నిత్యం నీరు నిలిచే ఏలూరు బస్టాండ్‌కు స్వచ్ఛత బస్టాండ్‌గా అవార్డు దక్కడం విశేషం. బస్టాండ్‌ మొత్తం గుంతలు, గోతులు, అత్యంత అధ్వానంగా పారిశుద్ధ్య నిర్వహణ ఉన్నా స్వచ్ఛ బస్టాండ్‌ అవార్డు దక్కింది. అలాగే ఏలూరు కార్పొరేషన్‌, మైనార్టీ వెల్ఫేర్‌, జిల్లా పరిషత్‌ కార్యాలయాలకు కూడా స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయాల అవార్డులు దక్కాయి. ఈ మూడు కా ర్యాలయాల్లోనూ పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. జిల్లా అధికార యంత్రాంగం ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర పేరుతో ఉద యం ఒక గంట సేపు ఫొటో ఫోజులకు పరిమితమై కాల్వ పూడిక పనులు గంట సేపు నిర్వహించడం, అలాగే అక్కడక్కడా మొక్కలు నాటడం, వాటి దగ్గర సెల్ఫీలు దిగడం మినహా శాశ్వత పరిష్కారం చేకూర్చేలా పనులు నిర్వహించకపోవడం, అవసరమైన నిధులు కేటాయించకపోవడంతో జిల్లాలో పారిశుద్ధ్య పరిస్థితి మొదలు డ్రెయిన్ల పూడికతీత పనుల వరకూ అన్నీ ఇబ్బందికరంగానే మారాయి.

చెత్తశుద్ధి కరువాయె

ఏలూరులో ఎక్కడి చెత్త అక్కడే..

మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి

జిల్లావ్యాప్తంగా క్షీణించిన పారిశుద్ధ్యం

అయినా రాష్ట్రస్థాయిలో జిల్లాకు అవార్డులు

స్వచ్ఛాంధ్ర పేరుతో అధికారుల హడావుడి

కానరాని స్వచ్ఛత 1
1/4

కానరాని స్వచ్ఛత

కానరాని స్వచ్ఛత 2
2/4

కానరాని స్వచ్ఛత

కానరాని స్వచ్ఛత 3
3/4

కానరాని స్వచ్ఛత

కానరాని స్వచ్ఛత 4
4/4

కానరాని స్వచ్ఛత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement