
పార్సిల్ వాహనాల్లో బాణసంచా తరలింపు నేరం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పార్సిల్ సర్వీస్ వాహనాల్లో బాణసంచా, పేలుడు, విస్ఫోటన పదార్థాలు, నిషేధిత హానికారక స్వభావం కలిగిన వస్తువులను తరలిస్తే చర్యలు తప్పవని ఉప రవాణా కమిషనర్ షేక్ కరీమ్ హెచ్చరించారు. దీపావళి పండగ దృష్ట్యా గురువారం డీటీసీ కార్యాలయంలో ఏలూరులోని పార్సిల్ సర్వీస్ సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. మందుగుండు సామగ్రి, విస్ఫోటన ప దార్థాలు తదితర నిషేధిత వస్తువులను నిల్వ చేయడం, లారీల్లో తరలించడం నేరమని, ఉ ల్లంఘనలకు పాల్పడే పార్సిల్ సర్వీస్ సంస్థలపై క్యారేజ్ బై రోడ్ యాక్ట్ 2007, ఎంవీ యాక్ట్, సీఎంవీ రూల్స్ ప్రకారం కేసులు నమో దు చేస్తామని హెచ్చరించారు. అనంతరం వాహన తనిఖీ అధికారులు వారికి నోటీసులు అందజేశారు. ఇన్‌చార్జి ఆర్టీఓ ఎస్‌బీ శేఖర్, వాహన తనిఖీ అధికారులు ఎండీ జమీర్, జి.స్వామి తదితరులు పాల్గొన్నారు.