
పాలిటెక్నిక్ విద్యార్థి దుర్మరణం
ఆగిరిపల్లి: ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో పాలిటెక్నిక్ విద్యార్థి మృతిచెందిన ఘటన ఆగిరిపల్లి దళితవాడ వద్ద చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని సింహాద్రి అప్పారావుపేటకు చెందిన పటాపంచులు సాయి (19) విస్సన్నపేటలోని వికాస్ కాలేజీలో పాలిటెక్నిక్ చదువుతున్నాడు. గురువారం రాత్రి ఆగిరిపల్లిలో తన పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై సింహాద్రి అప్పారావుపేటకు వెళ్తుండగా విజయవాడ రోడ్డులోని దళితవాడ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో రోడ్డుపై పడ్డాడు. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలికి చేరుకున్న ఎస్సై శుభశేఖర్ బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఏలూరు(మెట్రో): జిల్లాలో ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన పథకంలో ఎంపిక చేసిన గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్దేశించిన సమయంలోపు పూర్తిచేస్తామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌కు తెలిపారు. ఏపీ సచివాలయం నుంచి గురువారం విజయానంద్ పలు అంశాలపై కలెక్టర్లతో సమీక్షించారు. జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలను కలెక్టర్ ఆయనకు వివరించారు.