
ట్రిపుల్‌ఐటీలో ‘ప్రజ్ఞ’ మాసపత్రిక ఆవిష్కరణ
నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్‌ఐటీ ‘ప్రజ్ఞ’ పేరిట మాసపత్రికను ప్రారంభించింది. తొలి సంచికను ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్, నూజివీడు డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ గురువారం ఆవిష్కరించారు. విద్యా ర్థుల చైతన్యం, ప్రతిభ, నూతన ఆవిష్కరణలను ఇందులో ప్రతి నెలా ప్రచురించనున్నట్టు తెలిపారు. ఐఐటీలలో ఇలాంటి మాసపత్రికలు ప్రచురితమవుతాయని, అలాంటి సంప్రదాయాన్ని ట్రిపుల్‌ఐటీలో కూడా పరిచయం చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. ఇంజినీరింగ్ విద్యార్థులే తమ పరిజ్ఞానంతో ఈ మాసపత్రికకు అంకురార్పణ చేసుకోవడం అభినందనీయమన్నారు. అనంతరం ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. సెంట్రల్ డీన్ శ్రావణి, ఈఐటీపీ డీన్ శ్యాం, పాలనాధికారి లక్ష్మణరావు, అకడమిక్ డీన్ సాదు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.