
ప్రచార ధ్యాస.. రోగుల ఘోష
ఆగిరిపల్లి: కూటమి ప్రభుత్వం అత్యవసర సేవలందించే వైద్యులను కూడా ప్రచార ఆర్భాటానికి వాడుకుంటోంది. సూపర్ జీఎస్టీ అవగాహన కార్యక్రమాలకు వైద్యులను వినియోగించుకోవడంతో పేదలకు వైద్యసేవలు దూరమవుతున్నాయి. ఆగిరిపల్లి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఉండగా ఒకరు సేవ లందిస్తున్నారు. రోజూ ఆస్పత్రిలో 100 మంది వర కు ఓపీ చూపించుకుంటారు. గురువారం ఆగిరిపల్లిలో జరిగిన సూపర్ జీఎస్టీ కార్యక్రమానికి ము ఖ్య అతిథిగా మంత్రి కొలుసు పార్థసారథి హాజర య్యారు. దీంతో ఉదయం కొందరు రోగులకు పీ హెచ్‌సీలో వైద్యం అందించిన తర్వాత వైద్యాధికారి జగన్‌మోహన్‌రావు జీఎస్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. దీంతో పీహెచ్‌సీలో డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో రోగులు సుమారు 3 గంటల పాటు అవస్థలు పడ్డారు. డాక్టర్లను ఇలా ప్రచారానికి వాడుకోవడం ఏంటని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై డాక్టర్ జగన్‌మోహన్‌రావుని వివరణ కోరగా ప్రభుత్వ ఆదేశాల మేరకే అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నట్టు చెప్పారు.