
గురువుల బోధనేతర బహిష్కరణ
● ఉదయం 9.20లోపు విద్యార్థుల హాజరు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ఆయా అటెండెన్స్, ఐఎంఎంఎస్ యాప్‌లో ఇన్స్‌పెక్షన్ రిపోర్టు పూర్తి చేయడం, మధ్యాహ్నం 12 గంటలలోపు భోజన పథకానికి సంబంధించిన మెనూ లైవ్, ఫొటోలు, వీడియోలు పంపాలి.
● 2 గంటలలోపు మొక్కల రిజిస్ట్రేషన్ నమోదు.
● సాయంత్రం విట్‌నెస్ యాప్ అప్‌డేట్ చేయాలి.
● ఆపై టీఎంఎఫ్, లీప్ యాప్, ఎఫ్‌ఎల్‌ఎన్, టీపీడీఎస్, మైస్కూల్, డిజిటల్ అటెండెన్స్, లాంగ్వేజ్ మాపింగ్‌లు వంటి పనులు చేయాలి.
● ఇలా క్లాస్‌రూమ్‌లో సమయం బోధనకు కాకుండా స్కీన్‌లపై స్వైపింగ్ చేయడానికే ఖర్చవుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
ఈనెల 7న నిర్వహించిన ధర్నాలో బోధనేతర పనులు, ఆన్‌లైన్ యాప్‌లు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బోధనేతర పనులు రద్దుపై దశల వారీగా ఆందోళనలు పెరిగేలా ఫ్యాప్టో ఆధ్వర్యంలో పోరాటానికి ఉపాధ్యాయులు సిద్ధం కావాలి.
– పుప్పాల సూర్యప్రకాశరావు,
జిల్లా ఫ్యాప్టో నాయకులు
బడుల్లోకి సెల్‌ఫోన్ ప ట్టుకుని వెళ్లకుండా కేవలం పాఠాలు మాత్రమే పిల్లలకు చెబుతాం. ఫేషియల్ హాజరు కోసం ప్రభుత్వం పరికరాలు అందించాలి. బోధనా సమయం హరించేలా ఉపాధ్యాయులకు అప్పగిస్తున్న ఆన్‌లైన్ పనులతో సింగిల్ టీచర్ స్కూళ్లలో పరిస్థితి దారుణంగా ఉంది.
– షేక్ రంగావలి, జిల్లా ఫ్యాప్టో నాయకులు
నిడమరు: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులతో బోధనేత పనులు చేయిస్తూ ఉపాధ్యాయ వృత్తినే కూటమి ప్రభుత్వం అవమానిస్తున్నట్లు ఉపాధ్యా య వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఫలితంగా విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారంటూ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 7న విజయవాడలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఈనెల 10 నుంచి ప్రభుత్వ బడుల్లో బోధనేతర కార్యక్రమాలు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు గురువారం జిల్లాస్థాయి అధికారులకు ఫ్యాప్టో నాయకులు వినతిపత్రాలు సమర్పించారు. దీంతో శుక్ర వారం నుంచి అన్ని ప్రభుత్వ బడులు బోధనేతర పనులు బహిష్కరించి నిరసనలు తెలిపేలా ఉపాధ్యాయ సంఘాల నాయకులు సన్నద్ధమవుతున్నారు. కూటమి ప్రభుత్వం విద్యారంగ మూలాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తుందని ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. వాట్సాప్‌లో అర్జెంట్, మోస్ట్ అర్జెంట్ అంటూ మెసేజ్‌లు, ఆన్‌లైన్‌లో పనులు, వెబెక్స్ మీటింగ్‌లతో రోజంతా బోధనకు దూరమవుతున్నట్టు వాపోతున్నారు.
బోధనేతన పనులతో నష్టాలు
కూటమి ప్రభుత్వంలో సర్కారీ బడులు అభ్యాస మందిరాలుగా కాకుండా డేటా సెంటర్లుగా మారు తున్నాయంటూ ఫ్యాప్టో నేతలు చెబుతున్నారు. బోధనేతర పనుల వల్ల రోజువారీ తరగతులు ఆల స్యం అవుతున్నాయి. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించేందుకు సమయం తగ్గిపోతుంది. టీచర్స్‌లో బోధనాసక్తి కూడా క్రమంగా తగ్గిపోతుంది. టెక్నికల్ సమస్యలతో మానసిక ఒత్తిడిలో పడటం, నా ణ్యతగల బోధన కంటే యాప్‌ల స్క్రీన్‌షాట్‌ల ప్రా ముఖ్యతకే అధికారులు ప్రాధాన్యమిస్తున్నారు.
పాఠశాలలు తెరిచిన నాటి నుంచీ..
ఈ ఏడాది జూన్ 12న పాఠశాల తెరిచిన నాటి నుంచి స్కూల్ ఆర్గనైజేషన్ టీములు, ఎంటీఎస్ బదిలీలు, కౌన్సెలింగ్‌లతో జూన్ నెల ముగిసింది. తర్వాత గిన్నిస్ రికార్డు పేరుతో యోగాంధ్ర ముందస్తు కార్యక్రమాలు, స్కూడెంట్ కిట్స్, పాఠ్యపుస్తకాలు తెచ్చుకుని అందించడం, బియ్యం లెక్కలు, మెగా పేరెంట్ మీటింగ్ 2.0కు పది రోజులు ముందుగా జూలై ముగిసింది. తర్వాత లీడర్‌షిప్, ప్రా థమిక అక్షరాస్యత, ఎఫ్‌ఎల్‌ఎన్ వంటి శిక్షణా కార్యక్రమాలు జరిగాయి. నిత్యం సర్వర్ డౌన్‌తో టీచర్ ముఖ హాజరు నమోదుకు ఉదయం, సాయంత్రం ఆలస్యమవుతోంది. దీంతోపాటు విద్యాశక్తి కార్యక్రమం కొనసాగుతోంది. విద్యార్థులకు అందించే సన్నబియ్యం బస్తాలు ఓపెన్ చేసి క్యూఆర్‌కోడ్‌లు స్కానింగ్ నమోదు, ప్రతి బియ్యం బస్తా, చిక్కీలు, రాగి, బియ్యం, క్లీనింగ్ టూల్స్, ఐఎఫ్‌పీ ట్యాబ్‌లెట్స్ పంపిణీ వంటివి ఆన్‌లైన్ చేయడం, ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలైన సూపర్ జీఎస్టీ ప్రచారాన్ని ఉపాధ్యాయులపై రుద్దడం దారుణమని ఆయా సంఘాల నాయకులు అంటున్నారు. ఈనెల 13 నుంచి ఎఫ్‌ఏ–2 పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసే సమయంలో ప్రభుత్వ ప్రచారాలకు ఉపాధ్యాయులను ఉపయోగించడం ఎంత వరకూ సబబు అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
రోజురోజుకూ పెరుగుతున్న యాప్‌ల భారం
నేటినుంచి బోధనేతర కార్యక్రమాల బహిష్కరణ
ఫ్యాప్టో పిలుపుతో నిలిచిపోనున్న ఆన్‌లైన్ వర్కులు

గురువుల బోధనేతర బహిష్కరణ

గురువుల బోధనేతర బహిష్కరణ