
చదువుల తల్లీ కరుణించమ్మా..
తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం శ్రీబాలాత్రిపుర సుందరీ పీఠంలో అక్షరాభ్యాసాలు
ద్వారకా తిరుమలలో సరస్వతీ దేవి అలంకారం
పెనుగొండ వాసవీ శాంతి థాంలో చిన్నారుల పూజలు
సరస్వతీ దేవి అలంకరణలో మావుళ్లమ్మ
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం మూలా నక్షత్రం కావడంతో అమ్మవారు సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. చదువుల తల్లి అనుగ్రహం పొందేందుకు తల్లిదండ్రులు తమ చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. రాష్ట్రంలోనే పేరెన్నికగన్న తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం శ్రీబాలాత్రిపుర సుందరీ పీఠంలో సామూహిక అక్షరాభ్యాసాలు అట్టహాసంగా నిర్వహించారు. బాసర తర్వాత మేధా సరస్వతీ నిలయమైన ఈ పీఠానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆలయాల్లో అక్షరాభ్యాసాలు, సరస్వతీ పూజలు నిర్వహించారు. – సాక్షి నెట్‌వర్క్

చదువుల తల్లీ కరుణించమ్మా..

చదువుల తల్లీ కరుణించమ్మా..

చదువుల తల్లీ కరుణించమ్మా..