
ఎరువుల షాపులపై విజిలెన్స్ దాడులు
బుట్టాయగూడెం: మండల కేంద్రమైన జీలుగుమిల్లిలో ఎరువుల డిపోలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా శనివారం తనిఖీలు నిర్వహించారు. విజయ ట్రేడర్స్‌లో లైసెన్స్ లేని ఎరువులను గుర్తించినట్లు జీలుగుమిల్లి ఏఓ గంగాధర్ తెలిపారు. విజిలెన్స్ డీఎస్పీ సింగులూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. షాపును సీజ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. సాదు ట్రేడర్స్ షాపులో రూ.1,89,414 విలువైన 19.800 టన్నుల ఎరువుల వ్యత్యాసాన్ని గుర్తించి షాపును సీజ్ చేసి, యజమానిపై కేసు నమోదు చేసినట్లు ఏఓ చెప్పారు.