
వైఎస్సార్‌సీపీ అనుబంధ కమిటీల్లో నియామకాలు
భీమవరం: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన ఇద్దరి రాష్ట్ర అనుబంధ విభాగాల్లో నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ప్రకటన జారీ చేసింది. స్టూడెంట్ వింగ్ సెక్రటరీగా భీమవరం పట్టణానికి చెందిన గంటా రాహుల్ రిచర్డ్స్, రాష్ట్ర బూత్ కమిటీ వింగ్ జనరల్ సెక్రటరీగా వీరవాసరం మండలం కొణితివాడకు యరకరాజు ఉమా శంకర్‌రాజు నియమితులయ్యారు. 8 = వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర దివ్యాంగుల విభాగం ప్రధ
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన రాపోలు భావన రుషి రాష్ట్ర వీవర్స్ వింగ్ కార్యదర్శిగా, పంగిడిగూడెంకు చెందిన కొప్పుల రవిచంద్రారెడ్డి రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శిగా, తాడువాయికి చెందిన కనికళ్ల ప్రసాద్ రాష్ట్ర బూత్ కమిటీ విభాగం కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేస్తామని తెలిపారు.
మున్సిపల్ విభాగం కార్యదర్శిగా సుబ్బారావు
చింతలపూడి: చింతలపూడి నగర పంచాయతీకి చెందిన ఆతుకూరి సుబ్బారావును రాష్ట్ర మున్సిపల్ విభాగం కార్యదర్శిగా నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
దివ్యాంగుల విభాగం ప్రధాన కార్యదర్శిగా రాజు
చింతలపూడి: వైఎస్‌ఆర్‌సీపీ దివ్యాంగుల విభాగం ప్రధాన కార్యదర్శిగా చింతలపూడి మండలం మల్లేశ్వరం గ్రామానికి చెందిన తాటిపర్తి రాజుని నియమిస్తూ శనివారం ఉత్తర్వు లు జారీ చేశారు.
సాంస్కృతిక విభాగం కార్యదర్శిగా కనకరాజు
కామవరపుకోట: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం కార్యదర్శిగా కామవరపుకోటకు చెందిన సొసైటీ మాజీ చైర్మన్ సాయన కనకరాజును నియమించారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.
టీచర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీగా ప్రతాప్
ముసునూరు/నూజివీడు: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర టీచర్స్ యూనియన్ స్టేట్ జనరల్ సెక్రటరీగా ముసునూరు జెడ్పీటీసీ డాక్టర్ వరికూటి ప్రతాప్ నియమితు లయ్యారు. నూజివీడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావుకు ముఖ్య అనుచరుడిగా, పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఆయనను స్టేట్ పదవికి ఎన్నుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. శక్తి వంచన లేకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు.

వైఎస్సార్‌సీపీ అనుబంధ కమిటీల్లో నియామకాలు

వైఎస్సార్‌సీపీ అనుబంధ కమిటీల్లో నియామకాలు

వైఎస్సార్‌సీపీ అనుబంధ కమిటీల్లో నియామకాలు

వైఎస్సార్‌సీపీ అనుబంధ కమిటీల్లో నియామకాలు

వైఎస్సార్‌సీపీ అనుబంధ కమిటీల్లో నియామకాలు

వైఎస్సార్‌సీపీ అనుబంధ కమిటీల్లో నియామకాలు

వైఎస్సార్‌సీపీ అనుబంధ కమిటీల్లో నియామకాలు

వైఎస్సార్‌సీపీ అనుబంధ కమిటీల్లో నియామకాలు