
భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం
ప్రభుత్వంలోకి వచ్చే ప్రజాప్రతినిధులు పదవీ ప్రమాణ సందర్భంగా గవర్నర్ ముందు చేసిన ప్రమాణానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. రాజ్యాంగంలోని మౌలికసూత్రాలకు భంగం కలిగిస్తున్నారు. పౌర, వ్యక్తిగత స్వేచ్ఛకు ఆటంకం కలిగిస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి వ్యక్తికి భావ వ్యక్తీకరణ, వాక్ స్వాత్రంత్రపు హక్కులు ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు గడిచినా ఇది ఎక్కడా అమలు కావడంలేదు. పత్రికా స్వేచ్ఛకు అవరోధం కలిగించడం మంచి పరిణామం కాదు.
– హరిదాసుల రవీంద్రకుమార్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఇంటెలెక్చువల్ కమిటీ కార్యదర్శి