ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రాన్ని శనివారం మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ముందుగా దేవస్థానం అధికారులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన శ్రీవారు, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు న్యాయమూర్తికి స్వామివారి శేష వస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని పలుకగా, ఆలయ ఏఈఓ రమణరాజు చినవెంకన్న చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.
ఏలూరు టౌన్ : ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి కే.సురేష్‌రెడ్డి ఏలూరు పర్యటన నేపథ్యంలో ఏలూరు రెవెన్యూ అతిథి భవనానికి వచ్చారు. హైకోర్టు న్యాయమూర్తి సురేష్‌రెడ్డిని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ మర్వాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి, మొదటి అదనపు జిల్లా జడ్జి ఎం.రామకృష్ణంరాజు, రెండో అదనపు జిల్లా జడ్జి ఇందిరా ప్రియదర్శిని, ఐదో అదనపు జిల్లా జడ్జి ఆర్‌వీవీఎస్ మురళీకృష్ణ, ఏడో అదనపు జిల్లా జడ్జి వై.శ్రీనివాసరావు, ఎనిమిదో అదనపు జిల్లా జడ్జి ఐ.శ్రీనివాసమూర్తి, పోక్సో స్పెషల్ జడ్జి కే.వాణిశ్రీ, పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్‌పర్సన్ మేరీగ్రేస్ కుమారి, జిల్లాలోని ఇతర న్యాయమూర్తులు హాజరయ్యారు.
శ్రీవారి సేవలో మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి