
అలరించిన నాట్య విన్యాసాలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరానికి చెందిన నటరాజ నాట్య కళాకేంద్రం, కళాదీపిక నృత్య అకాడమీ, శ్రీశ్రీ కల్చరల్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో 12వ జాతీయ స్థాయి నృత్య అవార్డుల ప్రదాన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. వైఎంహెచ్‌ఏ హాలులో ఈ కార్యక్రమం రాత్రి 10 గంటల వరకూ కొనసాగింది. 150 మంది చిన్నారులు చేసిన నృత్య విన్యాసాలు మంత్రముగ్ధులను చేశాయి. 20 మంది నృత్య గురువులకు నాట్య విదాత అవార్డులు ప్రదానం చేసి సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు ఎన్.రాజ్‌కుమార్ మాట్లాడుతూ ఎంతోమంది చిన్నారులను ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాట్య గురువు వేదాంతం రాధేశ్యామ్, కళారత్న ఏ.పార్వతి రామచంద్రన్, నాట్యాచార్య డీ.హేమసుందర్ అతిథులుగా పాల్గొనగా, నటరాజ నాట్య కళాకేంద్రం నిర్వాహకురాలు ఎన్.కృష్ణవేణి కార్యక్రమాలు పర్యవేక్షించారు.