
గుంతలు పూడ్చండి మహాప్రభో!
ఏలూరు నగరంలో ఎక్కడ చూసినా గుంతలే. ఈ భారీ గోతుల మధ్య ప్రయాణమంటే జనం భయపడుతున్నారు. వర్షం పడితే గుంతల్లో నీరుచేరి ఎంత లోతు ఉందో తెలియక వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వర్షం నీటితో గుంతలన్నీ చెరువును తలపిస్తున్నాయి. ముఖ్యంగా ఏలూరు వన్‌టౌన్ ప్రాంతంలోని సత్యనారాయణ థియేటర్ రోడ్డు మరీ అధ్వానంగా తయారైంది. కనీసం గుంతలైనా పూడ్చమని ప్రజలు మొరపెట్టుకుంటున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు
వైఎంహెచ్‌ఎ హాల్ సెంటరులో..
సత్యనారాయణ థియేటర్ మెయిన్ రోడ్డులో..
ఏలూరు పెద్ద వంతెన సెంటర్ వద్ద..

గుంతలు పూడ్చండి మహాప్రభో!

గుంతలు పూడ్చండి మహాప్రభో!

గుంతలు పూడ్చండి మహాప్రభో!