
శ్రీవారిని దర్శించుకున్న తూర్పుగోదావరి కలెక్టర్
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రాన్ని శనివారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా నూతన కలెక్టర్ చేకూరి కీర్తి సందర్శించారు. ఉద్యోగ బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆలయానికి విచ్చేసిన ఆమెకు దేవస్థానం అధికారులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు ఆమెకు శ్రీవారి శేష వస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలుకగా, ఆలయ సూపరింటిండెంట్ జి.సుబ్రహ్మణ్యం స్వామివారి జ్ఞాపికను, ప్రసాదాలను అందజేశారు.