
రైతు పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం
● 9న ర్యాలీ, వినతిపత్రం అందజేత
● పార్టీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్
కైకలూరు: పంటలకు అదునులో వేయాల్సిన యూ రియా సరఫరాలో విఫలమైన తెలుగుదేశం ప్రభు త్వ వైఫల్యాన్ని ఎండగడుతూ ఈనెల 9న ఏలూరు ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందించే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) పిలుపినిచ్చారు. కై కలూరు పార్టీ కార్యాలయంలో గురువారం నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. డీఎన్నార్ మాట్లాడుతూ పార్టీ ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం అక్కడక్కడా యూరియాను సరఫరా చేస్తోందన్నారు. పూర్తిస్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరించడానికి మంగళవారం ఉదయం 10 గంటలకు ఏలూరుకు అందరూ హాజరుకావాలన్నారు. ముందుగా వైఎస్ విగ్రహానికి నివాళి అర్పించి, శాంతియుత ర్యాలీతో ఆర్డీఓ కార్యాలయానికి చేరాలన్నారు. ఇప్పటివరకు కై కలూరు నియోజకవర్గంలో 6,600 పైబడి కార్యకర్తలు, నాయకుల వివిధ హోదాల్లో పదవులు పొందారన్నారు. వీరికి పార్టీ తరఫున గుర్తింపు కార్డులు అందిస్తామన్నారు. ఒకేసారి అందరికీ సెల్‌ఫోన్లలో సందేశాలు అందించే పక్రియను ప్రారంభిస్తామన్నారు. నియోజకవర్గంలో వివిధ విభాగాల పనితీరును బోర్డుపై డీఎన్నార్ వివరించారు.
కూటమి ప్రభుత్వానికి అరిష్టం
పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చేబోయిన వీరరాజు, ముదిరాజుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కోమటి వి ష్ణువర్ధనరావు మాట్లాడుతూ రైతు కన్నీళ్లు కూటమి ప్రభుత్వానికి అరిష్టదాయకమన్నారు. 50 ఏళ్ల క్రితం యూరియా కొరత చూశామని, చంద్రబాబు పాలనలో మరోసారి కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీపీలు రామిశెట్టి సత్యనారాయణ, పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్ మాట్లాడుతూ విజనరీ సీఎం అని చెప్పుకునే వారు యూరియా సమస్యను పరిష్కరించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. పార్టీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి బీవీ రావు మాట్లాడుతూ కూటమి పేరు మార్చిన అన్నదాత సుఖీభవతో ఉపయోగం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి గాదిరాజు మణికంఠ వర్మ, రాష్ట్ర మైనార్టీ సెల్ సెక్రటరీ గాలిబ్‌బాబు, జిల్లా మేధావుల ఫోరం అధ్యక్షుడు దుగ్గిరాల నాగు, ఎస్సీ విభాగ రాష్ట్ర నాయకుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు తిరుమాని రమేష్, బోయిన రామరాజు, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు జయమంగళ కాసులు, బొమ్మనబోయిన గోకర్ణయాదవ్, దున్నా బేబీ, చాన్‌భాషా, చినరాజు, ఈడే వెంకటేశ్వరరావు, మండ నవీన్, ఏసుబాబు, నరసయ్య, బొబ్బిలి రత్తయ్యనాయుడు, సమయం అంజి, రేగిశెట్టి రాము పాల్గొన్నారు.