
రూ.16.63 లక్షలకు లడ్డూ వేలం
నూజివీడు: మండలంలోని మిట్టగూడెం వినాయక చవితి నవరాత్రుల్లో విఘ్నేశ్వరుడికి ప్రసాదంగా ఏర్పాటుచేసిన 11 కేజీల లడ్డూకు శనివారం వేలం నిర్వహించగా రూ.16.63 లక్షలకు మాజీ ఎంపీటీసీ కొనకళ్ల మాధవరావు దక్కించుకున్నారు. గతేడాది సైతం లడ్డూను వేలంలో రూ.9.09 లక్షలకు మాధవరావు సొంతం చేసుకున్నారు. సర్పంచ్ కొనకాల నరసింహారావు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
బుట్టాయగూడెం: కలకత్తా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఒక కంటైనర్‌ను జీలుగుమిల్లి పోలీసులు శనివారం తనిఖీ చేసి అందులో సుమారు 12,100 కేజీల గోమాంసాన్ని పట్టుకున్నారు. గ్రామశివారులోని హెచ్‌పీ గ్యాస్ గోడౌన్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా కంటైనర్‌లో ఏదో తరలిస్తున్నట్లు అనుమానంతో తనిఖీ చేయగా గోమాంసాన్ని గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ మాంసాన్ని నిర్జీవ ప్రదేశంలో ఖననం చేశారు.