
రైతుల కళ్లలో వెలుగులు నింపాలి
జంగారెడ్డిగూడెం: రైతుల కళ్లల్లో కన్నీళ్లు తుడిచి, వెలుగులు నింపాలని వైఎస్సార్‌సీపీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు డిమాండ్ చేశారు. ఈనెల 9న జంగారెడ్డిగూడెంలో ప్రదర్శన నిర్వహించి రైతు సమస్యలపై ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించే నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకుడు జెట్టి గురునాథరావుతో కలిసి ఆయన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయరాజు మాట్లాడుతూ ఈనెల 9న రైతుల సమస్యలు పరిష్కరించి, యూరియా, ఎరువులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచి, గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు చేపట్టాలని కోరుతూ భారీ ప్రదర్శన నిర్వహించనున్నామన్నారు. కూటమి ప్రభు త్వం అధికారంలోకి రావడానికి మోసపూరిత వా గ్దానాలు చేసిందన్నారు. గతేడాది అన్నదాత సుభీభవకు ఎగనామం పెట్టిందన్నారు. మెట్ట ప్రాంతంలో పొగాకు, మిచ్చి, కోకో, పామాయిల్ తదితర పంటలకు గిట్టుబాటు ధరలు లేవన్నారు. ప్రస్తుతం యూరియా కొరతతో రైతులు అల్లాడుతున్నారని, గంటల తరబడి డీసీఎంఎస్‌ల వద్ద పడిగాపులు పడాల్సి వస్తోందన్నారు. యూరియా కోసం రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సీఎం చంద్రబాబు ఈ విషయంలో సిగ్గుపడాలన్నారు. చంద్రబాబు దృష్టి అమరావతిపై ఉందని, రైతులపై లేదన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కీసర సరితా రెడ్డి, పార్టీఉపాధ్యక్షుడు జగ్గవరపు జానకిరెడ్డి, జిల్లా మున్సిపల్ విభాగం అధ్యక్షుడు బొడ్డు వెంకటేశ్వరరావు, ప్రచార విభా గం అధ్యక్షుడు త్సల్లాబత్తుల శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు కర్పూరం గవరయ్య గుప్త, నాలుగు మండలాల అధ్యక్షులు ఓరుగంటి నాగేంద్ర, రమేష్‌రెడ్డి, ఎ.శాంతారావు, ఆర్.సత్యనారాయణ, రైతు విభాగం అధ్యక్షులు ఖాదర్‌బాబు రెడ్డి, చండీ ప్రియ, ముప్పిడి శ్రీనివాసరావు, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శులు గురుజాల పార్థసారథి, కుక్కల ధర్మరాజు, మల్నీడి బాబి, జెట్టి ఆదిత్య, బత్తిన చిన్న, చింతలపూడి జెడ్పీటీసీ ఎం.నీరజ పార్టీ నాయకులు పాల్గొన్నారు.