గుర్రపుడెక్క.. తీసేయాలి పక్కా.. | - | Sakshi
Sakshi News home page

గుర్రపుడెక్క.. తీసేయాలి పక్కా..

Sep 2 2025 7:18 AM | Updated on Sep 2 2025 7:18 AM

గుర్ర

గుర్రపుడెక్క.. తీసేయాలి పక్కా..

గుర్రపుడెక్క.. తీసేయాలి పక్కా..

ఆందోళన వద్దు

పెదఎడ్లగాడి వంతెన 56 ఖానాలకు చేరిన డెక్క

పెనుమాకలంక రహదారిలో రెండు చోట్ల గండి

భయాందోళనలో కొల్లేరు గ్రామాల ప్రజలు

కై కలూరు: గుర్రపుడెక్క కొల్లేరు గ్రామాలకు వణుకుపుట్టిస్తోంది. తీసేకొలది ఎగువ నుంచి రెట్టింపుగా కొట్టుకొస్తోంది. ఏమీ చేయాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వరద నీరు బుడమేరు, తమ్మిలేరు, రామి లేరు, గుండేరు వంటి భారీ డ్రెయిన్లతో పాటు మరో 31 మీడియం, మైనర్‌ డ్రెయిన్లు, కాలువలు చానల్స్‌ ద్వారా పెద్ద ఎత్తున కొల్లేరుకు చేరుతుంది. వరదల సమయంలో 1,10,920 క్యూసెక్కులు కొల్లేరుకు వస్తుందని అంచనా. వీటిలో కేవలం 12 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే ఉప్పుటేరు ద్వారా 62 కిలోమీటర్లు ప్రయాణించి బంగాళాఖాతం చేరుతుంది. ఈ మార్గంలో గుర్రపుడెక్క అనేక చోట్ల పేరుకుపోయి నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారుతోంది.

పెద్ద సమస్యగా పెదఎడ్లగాడి వంతెన

కొల్లేరుకు చేరే నీటిని సముద్రానికి పంపించే క్రమంలో మండవల్లి మండలం పెదఎడ్లగాడి వంతెన ప్రధాన భూమిక పోషిస్తోంది. వంతెనకు 56 ఖానాలు ఉన్నాయి. ఇటీవల పొక్లెయిన్లతో డెక్కను తీయించారు. కొద్ది రోజులకే తిరిగి మరింతగా ఎగువ నుంచి డెక్క కొట్టుకువచ్చింది. ప్రస్తుతం వంతెన మొత్తం ఖానాలన్నింటిలోనూ డెక్క పట్టేసింది. దీంతో నీటి ప్రవాహం మందగిస్తోంది. ఆదివారం పెదఎడ్లగాడి వంతెన వద్ద 2.5 మీటర్ల నీటి మట్టం నమోదైంది. ఇది 4 మీటర్లు దాటితే ప్రమాదకరం. తెలంగాణలో విస్తార వర్షాల కారణంగా ఖమ్మం జిల్లా నుంచి నీరు కొల్లేరుకు చేరుతోంది. దీంతో కొల్లేరు గ్రామాలు భయాందోళన చెందుతున్నాయి.

తమ్మిలేరు నుంచి 934 క్యూసెక్కుల నీరు

తెలంగాణ రాష్ట్రంలో విస్తార వర్షలతో వరద నీరు తమ్మిలేరు జలాశయానికి చేరుతోంది. ప్రస్తుతం 1,500 క్యూసెక్కుల నీరు నిల్వ ఉంది. దీని నుంచి 934 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నీరు ఏలూరు, తంగెళ్ళమూడి మీదుగా కొల్లేరుకు చేరుతోంది. అక్కడ మండవల్లి మండలం పెదఎడ్లగాడి మీదుగా ఉప్పుటేరుగా చేరి సముద్రానికి చేరాలి. ప్రస్తుతం తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ నీరు కూడా తోడైతే తమ్మిలేరులో నీటి మట్టం 2,000 క్యూసెక్కులకు చేరుతోంది. అప్పుడు తప్పని పరిస్థితుల్లో వరద నీటిని కొల్లేరుకు వదలాలి. ఇదే జరిగితే గుర్రపుడెక్క అడ్డు కారణంగా కొల్లేరు గ్రామాలు నిండా నీటిలో మునుగుతాయి.

పెనుమాకలంక రహదారికి గండ్లు

ఎగువ నుంచి భారీగా చేరిన గుర్రపుడెక్క కారణంగా పెదఎడ్లగాడి వంతెన నుంచి దిగువకు వరద నీరు నెమ్మదిగా పారుతోంది. ఈ కారణంగా నీరు ఎగదన్ని మండవల్లి మండలం పెదఎడ్లగాడి నుంచి పెనుమాకలంక చేరే రహదారిలో రెండు ప్రాంతాల్లో గండ్లు పడ్డాయి. ఇటీవల వర్షాలకు రహదారిలో రెండు ప్రాంతాల్లో భారీ గండ్లు పడటంతో పోలీసుశాఖ రాకపోకలను నిలుపుదల చేసింది. ప్రస్తుతం ద్విచక్రవాహనాలు, కార్లు వెళుతున్నాయి. తెలంగాణలో వర్షాలు కారణంగా తిరిగి గండ్లు పడ్డాయి. నీటి ప్రవాహం రోజురోజుకు పెరుగుతుంది. ప్రతి ఏటా ముంపు బారిన పడుతున్నామని, శాశ్వత పరిష్కారం చూపాలని కొల్లేరు ప్రజలు కోరుతున్నారు.

కొల్లేరు గ్రామాల ప్రజలు ఆందోళన చెందవద్దు. పెదఎడ్లగాడి వద్ద గుర్రపుడెక్కను ఇటీవల తొలగించాం. పైనుంచి తిరిగి కొట్టుకొచ్చింది. నీటి ప్రవాహాన్ని బట్టి మరో పర్యాయం తొలగిస్తాం. పెనుమాకలంక రహదారిలో రెండు చోట్ల ప్రతి ఏటా గండి పడుతోంది. అక్కడ రోడ్డును ఎత్తు చేసే ఆలోచన చేస్తున్నాం. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నాం.

– ఎం.రామకృష్ణ, డ్రెయినేజీ డీఈ, కై కలూరు

గుర్రపుడెక్క.. తీసేయాలి పక్కా.. 1
1/2

గుర్రపుడెక్క.. తీసేయాలి పక్కా..

గుర్రపుడెక్క.. తీసేయాలి పక్కా.. 2
2/2

గుర్రపుడెక్క.. తీసేయాలి పక్కా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement