
జల్లేరువాగు పొంగి పొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి
ఏజెన్సీప్రాంతంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దొరమామిడి, అలివేరు, లంకపాకల, ఎర్రాయిగూడెం, అంతర్వేదిగూడెం, కామవరం, తదితర గ్రామాల్లో భారీగా వర్షం కురవడంతో కొండవాగులు పొంగిపొర్లాయి. చింతకొండ వాగుతోపాటు రెడ్డిగణపవరం సమీపంలో ఉన్న జల్లేరువాగు పొంగి పొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
సాయంత్రం సమయానికి పనులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, కూలీలు, రైతులు ఇంటికి చేరే మార్గం లేక జల్లేరు వాగుకు ఇరువైపులా నిలబడిపోయారు. రాత్రి వరకూ వాగులు పొంగుతూనే ఉన్నాయి. – బుట్టాయగూడెం