ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉద్యోగ, ఉపాధ్యాయులకు నిరాశ మిగిల్చిందని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెడ్డం సుధీర్ ఓ ప్రకటనలో తెలిపారు. పెండింగ్ బకాయిలు, డీఏలు, ఆర్థిక ప్రయోజనాలు, 12వ పీఆర్‌సీ, ఐఆర్ గురించి ప్రభుత్వం ప్రకటించలేదన్నారు. కూటమి ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలపై మాట్లాడకపోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. 2004లో ఉపాధ్యాయ, ఉద్యోగులకు వ్యతిరేకంగా పనిచేసిన నాటి టీడీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపిన విషయాన్ని గుర్తుచేశారు. ఉపాధ్యాయుల బదిలీలు జరిగి మూడు నెలలు కావస్తున్నా కొందరికి జీతాలు రాకపోవడం దురదృష్టకరమన్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
వైఎస్సార్‌సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా బీవీ రావు
కైకలూరు: వైఎస్సార్‌సీపీ ఇంటలెక్చువల్స్ (మేధావుల) ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా బుసనబోయిన వెంకటేశ్వరరావు (బీవీ రావు)ను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నియామక ఉత్తర్వులు గురువారం అందాయి. కై కలూరు మండలం వరహాపట్నంకు చెందిన బీవీ రావు సీనియర్ చార్టర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. తనకు రాష్ట్రస్థాయి పదవి కేటాయించినందుకు పార్టీ అధినేత జగన్, ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్)కు కృతజ్ఞతలు తెలిపారు.
ఘనంగా చేనేత దినోత్సవం
ఏలూరు(మెట్రో): దేశ సాంస్కృతిక వారసత్వానికి చేనేతరంగం చిహ్నంగా నిలుస్తుందని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. గురువారం జిల్లా చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవరం సందర్భంగా నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ పాల్గొన్నారు. ఫైర్‌స్టేషన్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకూ చేనేత కార్మికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.
చేనేత రంగాన్ని కాపాడాలి
ఏలూరు (టూటౌన్): చేనేత రంగాన్ని, నేత కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కడుపు కన్నయ్య, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు విమర్శించారు. స్థానిక 36వ డివిజన్‌లో గురువారం చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వాలు బడ్జెట్‌లో అరకొర నిధులు కేటాయిస్తూ చేనేత పరిశ్రమను చిన్నచూపు చూస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. ఏ ఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే, సంఘ కార్యకర్తలు పాల్గొన్నారు. చేనేతకు మరణ శాసనమైన జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పిచ్చుక ఆదిశేషు డిమాండ్ చేశారు. స్థానిక పత్తేబాద మరకవారి వీధిలో చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు.
బాల పురస్కార్‌కు దరఖాస్తుల ఆహ్వానం
ఏలూరు (టూటౌన్): రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల కోసం ఈనెల 15లోపు దర ఖాస్తు చేసుకోవాలని డీసీపీఓ సూర్యచక్రవేణి గురువారం ప్రకటనలో తెలిపారు. వివిధ రంగాల్లో అత్యుత్తమ ధైర్యసాహసాలు, ప్రతిభ కనబర్చిన 5–18 ఏళ్లలోపు బాలలు అర్హులని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ 79015 97267లో సంప్రదించాలని కోరారు.
బ్యాంకు ఏజెంట్ల పేరుతో మోసం
భీమవరం: బ్యాంకు రికవరీ ఏజెంట్లుమంటూ ఇద్దరు వ్యక్తులు భీమవరం ఏడో వార్డుకు చెందిన కె.రామలక్ష్మి నుంచి రూ.2 లక్షలు తీసు కుని మోసగించినట్టు పోలీసులు తెలిపారు. పట్టణంలోని మారుతీనగర్‌లో భవనానికి మార్టిగేజ్ రుణం తీసుకున్నారు. వాయిదా చె ల్లించాల్సి ఉండగా హైకోర్టులో స్టే వేద్దామని చెప్పి నగదు తీసుకుని ఇప్పటివరకు సమాధా నం చెప్పడం లేదని రామలక్ష్మి ఫిర్యాదు చేశారు.

చేనేత రంగాన్ని కాపాడాలి

ఘనంగా చేనేత దినోత్సవం