వేధింపులు ఆపాలి | - | Sakshi
Sakshi News home page

వేధింపులు ఆపాలి

Aug 8 2025 7:42 AM | Updated on Aug 8 2025 7:42 AM

వేధిం

వేధింపులు ఆపాలి

పనిచేయని ఫోన్లను తిరిగి అప్పగించిన అంగన్‌వాడీలపై అధికారుల వేధింపులు మానాలి. టార్గెట్ల పేరుతో అధికారులు తీవ్రంగా వేధిస్తున్నారని అంగన్‌వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులు ఆపకపోతే సీఐటీయూ ఆధ్వర్యంలో పోరాటం ఉధృతం చేస్తాం.

– డీఎన్‌వీడీ ప్రసాద్‌, సీఐటీయూ జిల్లా కార్యదర్శి, ఏలూరు

వెసులుబాటు కల్పించాలి

ఫేస్‌ క్యాప్చర్‌తో నిమిత్తం లేకుండా మాన్యువల్‌గా రేషన్‌ ఇచ్చే వెసులుబాటు కల్పించాలి. యాప్‌ల వల్ల మాతో పాటు లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లబ్ధిదారులు ఓటీపీ చెప్పేందుకు సంబంధిత ఫోన్లు అందుబాటులో ఉండటం లేదు.

– పి.సుజాత, జిల్లా అధ్యక్షురాలు, ఏపీ అంగన్వాడీ

వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌, ఏలూరు జిల్లా

అప్‌లోడ్‌ కావడం లేదు

మాకిచ్చిన ఫోన్లలో యాప్‌లు అప్‌లోడ్‌ అవడం లేదు. పీడీఎఫ్‌ ఫైల్స్‌ ఓపెన్‌ కావడం లేదు. దీనికితోడు స్వర్ణాంధ్ర యాప్‌ పనులు చేయమంటున్నారు. దీంతో చాలా ఇబ్బంది పడుతున్నాం. అయినా అధికారులు టార్గెట్లు పూర్తిచేయాలని ఒత్తిడి తెస్తున్నారు.

– పి.భారతి, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ అంగన్‌వాడీ

వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌, ఏలూరు జిల్లా

5జీ ఫోన్లు ఇవ్వాలి

తక్షణమే అంగన్‌వాడీలకు 5జీ ర్యామ్‌ ఉన్న ఫోన్లను ఇవ్వాలి. పాత ఫోన్లలో న్యూవెర్షన్‌ యాప్‌లను అప్‌లోడ్‌ చేయమంటే ఎలా. ఐసీడీఎస్‌ అధికారులు అర్థం చేసుకోవాలే తప్ప మాపై కక్ష సాధింపులకు దిగడం సరికాదు. అన్ని యాప్‌లను కలిపి ఒకే యాప్‌గా మార్చాలి.

– టి.మాణిక్యం, జిల్లా కోశాధికారి,ఏపీ అంగన్వాఢీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌,ఏలూరు జిల్లా

వేధింపులు ఆపాలి 
1
1/3

వేధింపులు ఆపాలి

వేధింపులు ఆపాలి 
2
2/3

వేధింపులు ఆపాలి

వేధింపులు ఆపాలి 
3
3/3

వేధింపులు ఆపాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement