
చట్టంపై విద్యార్థులకు అవగాహన
చెట్లకు చేటు
విద్యుత్ లైన్ పేరుతో జంగారెడ్డిగూడెంలో భారీ వృక్షాలను నరికి కలప తరలించుకుపోయారు. చెట్ల నరికివేతకు ఎవరికీ అనుమతులు ఇవ్వలేదని అధికారులు తెలిపారు. 8లో u
ఏలూరు (టూటౌన్): నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ అన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ అమరావతి ఆదేశాల ప్రకారం శ్రీజాతీయ న్యాయ సేవాధికార సంస్థ–బాలల స్నేహ పూర్వక న్యాయ సేవల పథకం 2024పై అవగాహన కల్పించేందుకు ఆక్స్‌ఫర్డ్ ఒలింపియాడ్ స్కూలు విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కె.రత్నప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు బాధ్యతలు కూడా తెలుసుకుని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయరాదని, గుడ్ టచ్ బాడ్ టచ్ పైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. బాలలకు అవసరమైన పక్షంలో ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు.