నేటి నుంచి శ్రీవారి పవిత్రోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి శ్రీవారి పవిత్రోత్సవాలు

Aug 7 2025 7:22 AM | Updated on Aug 7 2025 9:13 AM

నేటి నుంచి శ్రీవారి పవిత్రోత్సవాలు

నేటి నుంచి శ్రీవారి పవిత్రోత్సవాలు

ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం నుంచి స్వామివారి దివ్య పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు ఈ నెల 10 వరకు వైభవంగా జరుగనున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో తెలిసీ, తెలియక జరిగిన తప్పుల ప్రాయశ్చిత్తం నిమిత్తం నాలుగు రోజుల పాటు ఈ పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. అందులో భాగంగా 7న అంకురార్పణ, 8న పవిత్రాధివాసం, 9న పవిత్రావరోహణ, 10న మహా పూర్ణాహుతి వేడుకలను నేత్రపర్వంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ ఎన్‌వీ సత్యనారాయణ మూర్తి తెలిపారు. ఉత్సవాలు జరిగే ఈ నాలుగు రోజులు ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నామని, భక్తులు గమనించాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement