
టీడీపీ కోవర్ట్ ఆపరేషన్
యాప్‌లతో వేగలేం
పనిచేయని స్మార్ట్‌ఫోన్లు మాకొద్దు అంటూ అంగన్‌వాడీలు నిరసన వ్యక్తం చేశారు. ఐసీడీఎస్ కార్యాలయాల్లో సెల్‌ఫోన్లను అప్పగించారు. 8లో u
ఆంక్షలపై నిరసన
పాఠశాలల్లోకి విద్యార్థి సంఘాలకు అనుమతి లేదంటూ ప్రభుత్వం విడుదల చేసిన జీఓపై విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. 8లో u
మంగళవారం శ్రీ 5 శ్రీ ఆగస్టు శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పోలవరం ఎమ్మెల్యే అవినీతి వ్యవహారం జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. వంద కోట్ల అవినీతి దేశానికే రోల్‌మోడల్ అంటూ దేవినేని ఉమ చేసిన వ్యాఖ్యల ఆడియో టేప్ హాట్‌టాపిక్‌గా మారిన క్రమంలో జన సైనికులు రగిలిపోతున్నారు. టీడీపీ కోవర్ట్ ఆపరేషన్‌తోనే ఇదంతా చేసి రాజకీయంగా జనసేనను పోలవరంలో అణచివేయడానికి తెరతీసిందని, దీనికి జనసేన కీలక నేత కరాటం రాంబాబును పావుగా వాడుకున్నారనే ప్రచారం జోరందుకోవడంతో నియోజకవర్గంలో జనసేన వర్సెస్ టీడీపీ రగడ హాట్ హాట్‌గా మారింది.
జనసేన భవితవ్యం గందరగోళం
జనసేన, టీడీపీ ఆధిపత్యపోరు కొనసాగిస్తున్న తరుణంలో తాజా ఎపిసోడ్‌తో జనసేన భవితవ్యం గందరగోళంలో పడింది. ఎమ్మెల్యే ఏడాదిలోనే వంద కోట్లు సంపాదించాడు.. భారీ భవనం కట్టుకున్నాడు.. దేశానికే అవినీతిలో రోల్‌మోడల్‌గా నిలిచాడంటూ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వర్గం మండిపడటం మినహా మరేమీ చేయలేని పరిస్థితి. అయితే ఇదంతా అబద్ధపు ప్రచారం, తప్పుడు ఆడియో రికార్డు అని ఎవరూ ఖండించకుండా పెద్ద మనుషుల మధ్య జరిగిన సంభాషణలు టీడీపీ ఎలా బయటపెడుతుందని, దీనిపై స్పందించాలని జనసేన చోటా నేతలు బలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ మొదలు టీడీపీ జిల్లా అ ధ్యక్షుడు వరకు ఎవరూ స్పందించని పరిస్థితి. మూడు రోజులుగా ఎమ్మెల్యే అవినీతి చేయలేదంటూ.. జనసేన కేడర్ చెప్పడమే కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో ఏం చేయాలనే దానిపై సందిగ్ధం నెలకొంది. దేవినేని ఉమాతో మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ అనుచరుడు పరిమి రాంబాబు చౌదరి అతడి ఫోన్ నుంచే కరాటం రాంబాబుతో మాట్లాడించారు. ఆడియో వాయిస్ రికార్డును టీడీపీ నేత రాంబాబు చౌదరే బయటపెట్టాడని, అతడిపై టీడీపీ చర్యలు తీసుకోవాలని జనసేన డిమాండ్ చేస్తున్నా టీడీపీ లైట్‌గా తీసుకుంది.
టీడీపీ ట్రాప్‌లో కరాటం
మరోవైపు టీడీపీ ట్రాప్‌లో జనసేన నేత కరాటం రాంబాబు పడటం వల్ల పార్టీకి, ఎమ్మెల్యేకు భారీ డ్యామేజ్ జరిగిందనే అంతర్గత చర్చ కొనసాగుతోంది. పార్టీపరంగా ఇబ్బందులు వస్తే ఖండించాల్సిన నాయకుడే సంభాషించడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి జనసేనలో నెలకొంది. ఇంకోవైపు దీనిపై కరాటం రాంబాబు స్పందిస్తూ దేవినేని ఉమానే సమాధానం చెప్పాలని ఒక్క మాటతో ముగించడంతో ఎమ్మెల్యే వర్గం మళ్లీ డైలమాలో పడింది. తాజా పరిణామాల క్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అధికారిక కా ర్యక్రమాల్లో ఆదివారం దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో ఏపీ ట్రైకార్ చైర్మన్, టీడీపీ నేత బొరగం శ్రీనివాస్ అన్నదాత సుఖీభవ సభలో పాల్గొనడం మరో చర్చకు తెరతీసింది. మొత్తంగా ఆడియో టేప్ వ్యవహారంలో జనసేన నేతనే టీడీపీ పావుగా వాడుకుని జనసేన ఎమ్మెల్యేనే అప్రతిష్టపాలు చేసే లా విజయవంతంగా మైండ్ గేమ్ నడిపింది.
న్యూస్‌రీల్
రగులుతున్న జన సైనికులు
పోలవరం ఎమ్మెల్యేను ఇరకాటంలో పడేసిన టీడీపీ శ్రేణులు
ఉద్దేశ పూర్వకంగానే ఆడియో లీక్ చేశారని అభియోగం
ముదురుతున్న జనసేన వర్సెస్ టీడీపీ రగడ

టీడీపీ కోవర్ట్ ఆపరేషన్