కూటమి పాలనలో రైతులకు కష్టాలు | - | Sakshi
Sakshi News home page

కూటమి పాలనలో రైతులకు కష్టాలు

Aug 5 2025 6:36 AM | Updated on Aug 5 2025 6:36 AM

కూటమి పాలనలో రైతులకు కష్టాలు

కూటమి పాలనలో రైతులకు కష్టాలు

ఏలూరు(మెట్రో): కూటమి పాలనలో రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, నూజివీడు, చింతలపూడి నియోజకవర్గాల కన్వీనర్లు మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు, కంభం విజయరాజు అన్నారు. రాష్ట్రంలో యూరియా సహా ఎరువుల కొరత, రైతు లు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏలూరు కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌లో వైఎస్సార్‌సీపీ నాయకులు కలెక్టర్‌ కె.వెట్రి సెల్వికి వినతిపత్రం అంజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి నాయకులు సూపర్‌సిక్స్‌ హామీలను అమలు చేయకపోగా రైతులను కష్టాలు పాలుజేశారన్నారు. రైతులకు పెట్టుబడి సా యం కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని, జూన్‌ 2024 నుంచి ఈ హామీ అమలు చేస్తామని చెప్పి మాట తప్పారన్నారు. రెండేళ్లకు రూ.40 వేలు ఇవ్వా ల్సి ఉండగా, కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చారని, అలాగే పథకం నుంచి 7 లక్షల మంది రైతులను తొలగించారని మండిపడ్డారు. పెట్టుబడి సాయం లేక రైతులు అప్పులపాలవుతున్నారని, పంటలకు గిట్టుబాటు ధరలు లేవని అన్నారు. ఉచిత పంటల బీమాను రద్దు చేశారని, సున్నావడ్డీ పథకాన్ని ఎత్తేశారన్నారు. రైతు భరోసా కేంద్రాలను నీరుగార్చారని, గ్రామస్థాయిలో వ్యవస్థలను ధ్వంసం చేశారని మండిపడ్డారు.

ఎరువు.. బరువు : రైతులకు ఎరువుల పంపిణీలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వి మర్శించారు. ముఖ్యంగా యూరియా దొరక్క రైతులు అల్లాడుతున్నారన్నారు. పొటాష్‌ కలిసిన కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు అమాంతం పెరిగిపోయాయన్నారు. ప్రైవేట్‌ వ్యాపారులు యూరియా బస్తాపై రూ.60 నుంచి రూ.100 వరకు అదనంగా డిమాండ్‌ చేస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎరువులను అందుబాటులో ఉంచాలని, యూరియా కొ రతను నివారించాలని, గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాల్లో నిల్వలు ఉంచి రైతులకు పంపిణీ చే యాలని డిమాండ్‌ చేశారు. ఉచిత పంటల బీమాను అమలు చేయాలని, గతేడాది రైతు భరోసా బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని కోరారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో విత్తు నుంచి ధాన్యం కొనుగోలు వరకూ రైతులకు అన్నింటా అండగా నిలిచామని చెప్పారు.

ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, రాష్ట్ర ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్‌బాబు, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గంటా మోహన్‌రావు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, రాష్ట్ర ఎస్సీ సెల్‌ కార్యదర్శి ఇమానైల్‌ జైకర్‌, రాష్ట్ర గ్రీవెన్స్‌ సెల్‌ సంయుక్త కార్యదర్శి బసవ లింగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి దాసరి రమేష్‌, జిల్లా అధికార ప్రతినిధి ఎం.జాన్‌ గురునాథం, జిల్లా రైతు విభాగ అధ్యక్షుడు వాసిరెడ్డి మధు, జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షు డు నెరుసు చిరంజీవి, జిల్లా గ్రీవెన్స్‌ అధ్యక్షుడు సముద్రాల దుర్గారావు, జిల్లా వైఎస్సార్‌టీయూసీ అధ్యక్షుడు పల్లి శ్రీనివాసరావు, జిల్లా వికలాంగుల విభాగం అధ్యక్షుడు షేక్‌ షమీం, జిల్లా ఆర్టీఐ విభాగం అధ్యక్షుడు స్టాలిన్‌, కార్పొరేటర్లు డింపుల్‌ జాబ్‌ రిషి, ఏలూరు నియోజవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు జుజ్జువరపు విజయనిర్మల, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఇనపనూరి జగదీష్‌, గ్రీవెన్స్‌ అధ్యక్షుడు మద్దాల ఫణి, జిల్లా స్టూడెంట్‌ విభాగం అధ్యక్షుడు పి.రాజేష్‌, కన్స్యూమర్‌ జిల్లా కార్యదర్శి టి.తులసి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

యూరియాతో సహా ఎరువుల కొరత

పూర్తిగా అందని పెట్టుబడి సాయం

కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన వైఎస్సార్‌సీపీ నాయకుల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement