
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం
ఏలూరులో మహిళలపై దాడి ఘటనలో కేసుల నమోదు
ఏలూరు టౌన్: ఏలూరులో ఆదివారం రాత్రి మహిళలపై దాడి చేసిన ఘటనపై ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్ సీరియస్ అయ్యారు. శాంతిభద్రతల కు విఘాతం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే స హించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏలూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సోమ వారం రాత్రి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. దాడి ఘటనలో ఇరువర్గాలపై కేసులు నమోదు చేశామని చెప్పారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు రూరల్ పరిధిలో మరడాని రంగారావు కాలనీ, పోణంగి రోడ్డులోని జరుగులమ్మ తల్లి గుడి ప్రాంతానికి చెందిన కాటూరి నిర్మల కుమారుడు లక్కీ అనే యువకుడు తల్లికి టిఫిన్ తెచ్చేందుకు మోటారు సైకిల్‌పై బయల్దేరాడు. అతడు వీఎస్‌ఆర్ గ్రాండ్ సిటీ వద్దకు చేరుకునేసరికి పల్లెపు సాయికుమార్, తురక మురళి, గుంజే జాన్ అనే ముగ్గురు వ్యక్తులు.. మోటారు సైకిల్ వేగంగా ఎందుకు నడుపుతున్నావంటూ నిలదీశారు. ఈ విషయంలో వారితో వాగ్వివాదం చోటుచేసుకోగా, లక్కీని కొట్టారని బాధితులు చెబుతున్నారు. అనంతరం మరోసారి ఈ ముగ్గురితో పాటు నిడిగట్టి నాగరాజు, బత్తుల దుర్గారావు, మరికొంతమంది కాటూరి లక్కీ ఇంటి వద్దకు వెళ్లారు. ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగగా కొట్టుకున్నారని, ఆ ఘటనపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ రెండు వర్గాలపై ఏలూరు రూరల్ పో లీస్‌స్టేషన్‌లో పలు సెక్షన్లలో కేసులు నమోదు చేశా మని డీఎస్పీ వివరించారు. ఈ రెండు వర్గాల వారికీ ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, స్వల్ప వివాదం నేపథ్యంలోనే గొడవ జరిగిందని, పోలీసులు స్పందించి చర్యలు తీసుకోలేదనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.
మహిళల దుస్తులు చించేస్తూ.. భయోత్పాతం
బాధితురాలు కాటూరి నిర్మల సోమవారం ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడుతూ తన కుమారుడు లక్కీని ముగ్గురు కలిసి కొట్టారని, లక్కీ ఇంటికి రాగా మరో 15 మంది వ్యక్తులు మహిళలని కూడా చూడకుండా ఇష్టారాజ్యంగా దుర్భాషలాడుతూ కొ ట్టారని, ఇదే సమయంలో మరో 50 మందిని పిలిపించుకుని తమ ఇళ్లపై దాడులు చేస్తూ భయో త్పాతం సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల దుస్తులు చించేస్తూ ఇష్టారాజ్యంగా దాడి చేశారన్నారు. దీనిపై ఏలూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో ఫిర్యాదు చేశామని చెప్పారు. అనంతరం రక్షణ కల్పించాలంటూ ఏలూరు చిరంజీవి బస్టాండ్ వద్ద ఆందోళన చేశామని తెలిపారు. పోలీసులు తమకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో నిరసన విరమించామన్నారు.