
ప్రొటోకాల్ పాటించడం లేదని ఫిర్యాదు
భీమవరం(ప్రకాశం చౌక్): యలమంచిలి మండల పరిధిలో అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని యలమంచిలి ఎంపీపీ ఇనుకొండ ధనలక్ష్మి సోమవారం ఇన్‌చార్జ్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డికి వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. మండలంలో జరుగుతున్న శంకుస్థాపనలకు, ప్రారంభోత్సవాలకు తనకు, వైఎస్సార్‌సీపీ చెందిన సర్పంచులకు, ఎంపీటీసీలకు ఆహ్వానం గాని, ప్రొటోకాల్ పరంగా గౌరవం గానీ ఇవ్వడం లేదన్నారు. ఇలా అనుమానించడం సరైన పద్ధతి కాదన్నారు. మండలంలో తీర్మానాలు చేసిన వర్క్‌లకు ఆర్డర్స్ ఇవ్వకుండా, మండలాన్ని అభివృద్ధి చేయకుండా అధికారులు అలసత్వాన్ని వీడి, ప్రొటోకాల్ ద్వారా మండ ల అభివృద్ధికి తోడ్పడేలే చర్యలు తీసుకోవాలని ఫి ర్యాదు చేయడంతో పాటు పలు అంశాలపై వినతిపత్రం అందజేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ము దునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, పార్లమెంట్ ఇన్‌చార్జి గూడూరి ఉమాబాల, పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, స ర్పంచుల చాంబర్ అధ్యక్షుడు కవురు గోపి పాల్గొన్నారు.
ఫ్యాక్టరీల్లో నిబంధనలు తప్పనిసరి
భీమవరం (ప్రకాశంచౌక్): కార్మిక చట్టాలు, ఉపాధికి సంబంధించిన పలు అంశాల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలి ఇన్‌చార్జి కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అన్నారు. భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం ప్రాన్ ప్రాసెసింగ్ యూనిట్ రైడింగ్ జిల్లాస్థాయి కమిటీ సభ్యులు, అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ఫ్యాక్టరీల్లో పనిచేసే మహిళా కార్మికుల సంక్షేమానికి నిబంధనలను విధిగా పాటించాలన్నారు. పని గంటలు, పని పరిస్థితులు మెరుగ్గా ఉండాలన్నారు. ఫ్యాక్టరీల్లో ఎక్కడ బాల కార్మికులు ఉండకూడదన్నారు.