
కూటమి నేతల వైఫల్యం
ఏలూరు జీజీహెచ్‌లో వైద్య సేవలు సరిగా అందటం లేద ని బాధితులు వాపోతున్నా రు. గత ప్రభుత్వంలో ఏలూరుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ, దానికి అనుసంధానంగా ఏలూరు జీజీహెచ్‌ను అభివృద్ధి చేస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కనీసం వైద్య నిపుణులను నియమించలేని దుస్థితి నెలకొంది. ప్రజలకు కనీస వైద్య సేవలు అందకపోయినా పట్టించుకునే నాథుడే లేడు. ప్రైవేటు ఏజెన్సీలకు గుండె వ్యాధుల నిర్ధారణ బాధ్యతలు అప్పగిస్తే ఎలా.
–గుడిదేశి శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ ఏలూరు నగర అధ్యక్షుడు
మెరుగైన సేవలు అందించాలి
జీజీహెచ్‌లో గర్భిణులు, బా లింతలకు సరైన వైద్య సేవ లు అందటం లేదని బాధితు లు గగ్గోలు పెడుతున్నారు. ఆపరేషన్లు సక్రమంగా చేయ కపోవటం, కుట్లు సరిగ్గా వే యకపోవటంతో బాలింతలు తీవ్ర అనారోగ్యం బారినపడుతున్నారు. ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయటానికి టెక్నీషియన్లను సైతం నియమించలేని దుస్థితి. జిల్లా ఉన్నతాధికారులు జీజీహెచ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి. మెరుగైన సేవలు అందించకుంటే ప్రజల తరఫున పోరాటం చేయాల్సి వస్తుంది.
–తుమరాడ స్రవంతి, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

కూటమి నేతల వైఫల్యం