
మద్యం షాపులో ఘర్షణ
ఇద్దరికి గాయాలు
తణుకు అర్బన్: మద్యం దుకాణంలో ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగిన వాగ్వివాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. తణుకులో జాతీయ రహ దారిలోని పాత బెల్లం మార్కెట్ ప్రాంతంలో రష్మిక మద్యం షాపు వద్ద ఆదివారం జరిగిన సంఘటనలో బీరు సీసాతో దాడికి తెగబడ్డారు. తణుకు పాతవూరుకి చెందిన సనమండ్ర రాజేష్, ముప్పిడి సత్యనారాయణ, చదలవాడ కిరణ్ మద్యం తాగుతుండగా పాత కక్షల నేపథ్యంలో ఘర్షణ రేగింది. దీంతో రాజేష్ బీరు సీసా పగులకొట్టి సత్యనారాయణ, కిరణ్‌లపై దాడి చేశాడు. తీవ్ర గాయాలైన ఇద్దరిని తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తణుకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మద్యం షాపులో ఘర్షణ