
మండుతున్న ఎండలు
పెంటపాడు: రోజురోజుకు ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఈ ఎండలు మండు వేసవిని తలపిస్తున్నాయి. ఎండ, ఉక్కపోతతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేక పోతున్నారు. వర్షాలు లేక ఎండకు నాట్లు దెబ్బతినే అవకాశం ఉంది. నాట్ల సమయంలో వర్షం వస్తే ఏపుగా ఎదుగుతాయి. ఎండల వల్ల ప్రజలు బయటకు రాక వ్యాపారాలు కూడా దెబ్బతింటున్నాయి. స్కూలుకు వెళ్లే చిన్నారులు ఎండ దెబ్బకు అల్లాడుతున్నారు. గూడెం నియోజకవర్గంలో అప్రకటిత విద్యుత్ కోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి పూట అయితే చెప్పక్కరలేదు. పెంటపాడు, గూడెం ప్రాంతాలలో రోజూ 10 గ్రామాల చొప్పున విద్యుత్ కోత ఉంటోంది.