
బందా మృతి తీరని లోటు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త వీ.బందా మృతి సాహితీ లోకానికి తీరని లోటని పలువురు వక్తలు అన్నారు. బందా సంతాప సభను సాహిత్య మండలి, గరికిపాటి ఆర్ట్స్, హేలాపూరి కళా పరిషత్, జిల్లా రచయితల సంఘం తదితర సాహిత్య కళా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించారు. సభకు అధ్యక్షత వహించిన తెలుగు రచయితల సంఘం అధ్యక్షుడు లంకా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గొప్ప స్నేహ శీలి, మంచి సాహితీవేత్త బందా అన్నారు. గరికిపాటి కాళిదాసు మాట్లాడుతూ ప్రవచనకారుడు గరికపాటి నరసింహరావు ద్విశత అవధానం కార్యక్రమం బందా నేతృత్వంలో నిర్వహించామని గుర్తుచేసుకున్నారు. లేళ్ళ వెంకటేశ్వరావు, మహమ్మద్ ఖాజావలీ, నాగాస్త్ర పుల్లాభొట్ల పురుషోత్తం, పీ సత్యవాణి, పీ ఆంజనేయులు, సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.