
అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక
ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లాకు సంబంధించి అథ్లెటిక్స్ జిల్లా జట్ల ఎంపికకు అనూహ్యా స్పందన వచ్చినట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దేవరపల్లి ప్రసాద్ తెలిపారు. స్థానిక ఏఎస్‌ఆర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన అండర్–14, 16, 18, 20 విభాగాల్లో పెద్ద సంఖ్యలో బాలబాలికలు పాల్గొని తమ ప్రతిభ చూపారన్నారు. పోటీలకు జిల్లా అథ్లెటిక్స్ సంఘం అధ్యక్షుడు గుళ్ళా ప్రసాదరావు, జల్లా వీరభద్రరావు, మరడాని అచ్యుతరావు, కోశాధికారి అన్యం శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించినట్లు తెలిపారు.
పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల సందడి
కై కలూరు: పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ నానాటికి పెరుగుతోంది. ఆదివారం ఉదయం పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించి అమ్మవారికి నైవేద్యాలను సమర్పించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ రూ.70,414 ఆదాయం వచ్చిందని తెలిపారు.
ముగ్గురిపై కేసు నమోదు
జంగారెడ్డిగూడెం: భార్యా భర్తల గొడవల నేపథ్యంలో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు హెచ్‌సీ టి.బాబూరావు తెలిపారు. ఈ నెల 1న పింగుల హరీష్‌కు, అతని భార్య మధ్య అక్కంపేటలోని వారి ఇంటి వద్ద చిన్న గొడవ జరిగింది. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు హరీష్‌పై దాడి చేసి కొట్టారు. మరో వ్యక్తి హరీష్ భార్యను దూషించారు. దీంతో హరీష్ భార్య చీమల మందు తినడంతో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. ఆదివారం హరీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెచ్‌సీ టి.బాబూరావు తెలిపారు.

అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక