
సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు
ముదినేపల్లి రూరల్: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారి పుట్టలో పాలు పోసి స్వామిని దర్శించుకున్నారు. పాలపొంగళ్ల శాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు. నాగబంధాల వద్ద స్వామివారి మూర్తులను ప్రతిష్ఠించేందుకు అర్చకులతో పూజలు చేయించి ప్రతిష్ఠ తంతు నిర్వహించారు. నాగబంధాల వద్ద, గోకులంలోని గోవులకు మహిళలు పసుపు కుంకుమలతో పూజలు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాద ఏర్పాట్లు చేశారు.
రాట్నాలమ్మకు భక్తిశ్రద్ధలతో పూజలు
పెదవేగి: పెదవేగి మండలం రాట్నాలకుంటలో వేంచేసిన రాట్నాలమ్మకు ఆదివారం ప్రీతికరమైన రోజు కావడంతో జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు దేవస్థానానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, వారి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఇందులో భాగంగా చిన్నారులకు అక్షరాభ్యాసాలు, నామకరణలు, ఇతర మొక్కుబడులు చెల్లించారు. ఈ వారం అమ్మవారికి మొత్తం రూ 79,053 ఆదాయం లభించిందని దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎన్.సతీష్‌కుమార్ తెలిపారు.
గుర్తుతెలియని మృతదేహం లభ్యం
పాలకొల్లు సెంట్రల్: పట్టణంలోని లాకు సెంటర్ వద్ద నిడదవోలు–నరసాపురం కాలువలో గుర్తు తెలియని పురుషుడి మృతదేహం కొట్టుకువచ్చింది. పై నుంచి కొట్టుకొచ్చినట్లుగా స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు