
అధికారులు సమర్థవంతంగా పనిచేయాలి
ఏలూరు(మెట్రో): ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో ఉమ్మడి పశ్చిమ గోదావరిజిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వేలాది కోట్ల నిధులను అందిస్తుందన్నారు. రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ పూర్తిచేసేందుకు, కొల్లేరు సమస్య పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. రైతులకు అవసరమైన భూసార పరీక్షలను నిర్వహించి ప్రాంతాలను బట్టి సమగ్రమైన ఏవిధమైన పంటలు సాగుకు మేలో అవగాహన కల్పించాలన్నారు. జెడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘరామకృష్ణంరాజు, కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. సమావేశంలో డీఆర్‌ఓ ఎం.వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈవో ఎం.శ్రీహరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ