
చెరువులో పడి వ్యక్తి మృతి
మండవల్లి: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన మండలంలోని భైరవపట్నంలో జరిగింది. గ్రామానికి చెందిన పండు జోజి పెద్ద కుమారుడు తరుణ్ అలియాస్ చందు (23) 31న ఒంటి గంట సమయంలో బయటకు వెళ్ళి తిరిగి రాలేదు. శుక్రవారం ఇంటి పక్కనే ఉన్న చేపల చెరువులో జారిపడి మృతిచెందాడు. పోలీసు సిబ్బంది కేసు నమోదు చేశారు.
రోడ్ల ఆక్రమణలపై చర్యలు
కొయ్యలగూడెం: పరింపూడి పంచాయతీ అంతర్గత రోడ్ల ఆక్రమణలపై చర్యలు తీసుకోనున్నట్లు కార్యదర్శి కే.సురేష్ పేర్కొన్నారు. శుక్రవారం పంచాయితీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు. జూలై 29 సాక్షిలో ప్రచురితమైన అంతర్గత రోడ్ల ఆక్రమణ విషయంపై ప్రజలతో మాట్లాడుతూ స్వమిత్వ కార్యక్రమంలో ప్రజలు ఫిర్యాదు చేసుకోవచ్చనని సూచించారు. సాక్షిలో వచ్చిన కథనంపై విచారణ చేసి ఆక్రమణలను గుర్తించామని వారికి నోటీసులు జారీ చేశామన్నారు. ఈ సందర్భంగా స్వమిత్వ ద్వారా ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను ఆయన పరిశీలించారు.
పీఎంశ్రీ స్కూల్‌గా
కొవ్వలి పాఠశాల
దెందులూరు: జిల్లాలో బెస్ట్ పీఎం శ్రీ స్కూల్‌గా కొవ్వలి ఉన్నత పాఠశాల ప్లస్ ఎంపికై ంది. పాఠశాల పీఎం శ్రీగా మారిన తరువాత ఈ పాఠశాలకు ప్రత్యేకంగా ముగ్గురు ఒకేషనల్ ట్రైనర్లను కేటాయిస్తారు. విద్యార్థులకు వ్యవసాయం,, ఆర్థిక వ్యవస్థ, బీమాపై అవగాహన కల్పిస్తారు. ఎన్‌సీసీ యూనిట్, స్కౌట్స్ గైడ్స్ విభాగాలు ఏర్పాటు చేస్తారు. పాఠశాలకు 200 మీటర్ల రన్నింగ్ ట్రాక్, లాంగ్ జంప్, కోకో కోర్టులు ఏర్పాటు చేశామన్నారు. కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇలా 39 అంశాలు సంతృప్తి చెందడంతో పాఠశాల పీఎం శ్రీ స్కూల్‌గా ఎంపికై ంది.
సిల్వర్ మెడల్ విజేత జెస్సిరాజ్‌కు సత్కారం
దెందులూరు: ఏసియన్ గేమ్స్ 2025 సబ్ జూనియర్ విభాగం సోలో డాన్స్‌లో సిల్వర్ మెడల్ విజేత ఇంటర్నేషనల్ స్కేటర్ జెస్సీరాజ్‌ను శుక్రవారం ఆంధ్రప్రదేశ్ శాప్ చైర్మన్ రవి నాయుడు సత్కరించారు. మరిన్ని పురస్కారాలు పొందాలని ఆకాంక్షించారు. కోచ్ సింహాద్రి, ఇండియా టీం కోచ్ సింగ్‌లను అభినందించారు.

చెరువులో పడి వ్యక్తి మృతి

చెరువులో పడి వ్యక్తి మృతి

చెరువులో పడి వ్యక్తి మృతి