
ట్రంప్ సుంకాల్ని తిప్పికొట్టాలి
ఏలూరు (టూటౌన్): అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలకు దీటుగా కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలోని ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని సీపీఎం ఏలూరు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రవి శుక్రవారం సీపీఎం జిల్లా కార్యాలయంలో మాట్లాడుతూ ఈ ప్రకటనపై ఇంతవరకు భారతదేశ ప్రభుత్వం గాని, కూటమి ప్రభుత్వం గాని ఎలాంటి స్పందన తెలపకపోవడం బాధాకరమన్నారు. ట్రంప్ సుంకాల ఫలితంగా ఆక్వా రంగం కుదేలైపోతుందని స్పష్టం చేశారు. ఆక్వా రంగం పైనే కాకుండా ఇతర అనేక రంగాలపై కూడా చూపుతుందన్నారు.
మావుళ్లమ్మను దర్శించుకున్న క్రికెటర్ నితీష్ కుమార్
భీమవరం (ప్రకాశంచౌక్): ప్రముఖ ఇలవేల్పు మావుళ్ళమ్మ వారిని ఇండియన్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకుడు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందించారు. ఈ నెల 8 నుంచి జరగనున్న ఆంధ్రా ప్రీమియం లీగ్ టీం లో భీమవరం బుల్స్ టీంకు నితీష్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.