
మానవ అక్రమ రవాణా నిరోధానికి చర్యలు
ఏలూరు (టూటౌన్): మానవ అక్రమ రవాణా నిరోధానికి పటిష్ట చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ ఆదేశించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో బుధవారం అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ అధికారులు, సామాజిక కార్యకర్తలు, సంఘ స్థాయి సభ్యులతో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా కె.రత్నప్రసాదు మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా సమాజంలో పెనుసవాల్‌గా మారిందని, సమాజం సమష్టి కృషితో నిరోధించాలని సూచించారు. ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యవంతులు చేయడం కోసం అవగాహన సదస్సులు ఏర్పాటు అక్రమ రవాణా నిరోధించడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. అక్రమ రవాణాకు గురైన బాధితులకు రక్షణ, పునరావాస సౌకర్యాలు కల్పిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల మహిళా పోలీసు ఇన్స్‌పెక్టర్లు సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శారద తదితరులు పాల్గొన్నారు.