
ద్వారకాతిరుమలలో భారీ వర్షం
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమలలో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. సాయంత్రం జల్లులు పడగా, రాత్రికి వర్షం ఊపందుకుంది. గంటపాటు ఎడతెరపి లేకుండా భారీగా వర్షం కురిసింది. దీంతో చినవెంకన్న ఆలయ మెట్ల మార్గంలోంచి నీరు వరదలా ప్రవహించింది. కొండపైన తూర్పు ప్రాంతంలోకి భారీగా వర్షం నీరు చేరింది. వర్షం ఆగిన తర్వాత నీరు దిగువ ప్రాంతానికి ప్రవహించింది.
వ్యాయామ విద్య ప్రాంతీయ పర్యవేక్షకుడిగా జాన్సన్
దెందులూరు : వ్యాయామ విద్య ప్రాంతీయ పర్యవేక్షకుడిగా జాన్సన్ నియమితులయ్యారు. జాన్సన్ గోపన్నపాలెం వ్యాయామ కళాశాలలో ఐదేళ్లుగా లెక్చరర్‌గా పనిచేశారు. కోనసీమ అంబేద్కర్, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు పర్యవేక్షకుడిగా వ్యవహరించనున్నారు.