ఏలూరు(మెట్రో): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ యాజమాన్యంలో పనిచేస్తున్న ఎగువ శ్రేణి సహాయకులకు పరిపాలనాధికారులుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం యలమంచిలి మండల పరిషత్‌లో పనిచేస్తున్న సీహెచ్.ఎ.పద్మజ, కాళ్ల మండల పరిషత్‌తో పనిచేస్తున్న జి.నాగేశ్వరరావులకు ఉత్తర్వులను అందజేశారు. కాగా ఇప్పటి వరకు 74 మందికి పదోన్నతులు కల్పించామని, వారిలో ఏవోలుగా 29 మంది, సీనియర్ అసిస్టెంట్‌లుగా 31మంది, జూనియర్ అసిస్టెంట్‌లుగా ఆరుగురు, రికార్డ్, లైబ్రెరీ, ల్యాబ్ అసిస్టెంట్‌లుగా 10 మందికి పదోన్నతులు కల్పించినట్లు జెడ్పీ చైర్‌పర్సన్ పద్మశ్రీ తెలిపారు.
గుర్తుతెలియని వ్యక్తి మృతి
భీమవరం: స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు వన్‌టౌన్ సీఐ ఎం.నాగరాజు చెప్పారు. ఈనెల 26వ తేదీన ఆర్టీసీ బస్టాండ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి సొమ్మసిల్లి పడిపోగా అధికారులు 108 అంబులెన్స్‌లో చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ఆ వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడి ఆచూకీ తెలిసినవారు 94407 96632, 94407 96633 నంబర్లలో సంప్రదించాలని సీఐ నాగరాజు కోరారు.