
మెట్ట ప్రాంత రైతులను ఆదుకోవాలి
కోట్లాది రూపాయల నిధులు కేటాయించి చేపట్టిన ఎత్తిపోతల పథకం నిర్మాణం నిరుపయోగంగా ఉంది. మెట్ట ప్రాంతంలో సన్న, చిన్నకారు రైతుల వేలాది ఎకరాలు వర్షాధారం మీద ఆధారపడి ఉన్నాయి. ప్రభుత్వం ఎర్రకాలువ ఎత్తిపోతల పథకాన్ని ఉపయోగంలోకి తీసుకొచ్చి రైతులను ఆదుకోవాలి.
– కంభం విజయరాజు, వైఎస్సార్ సీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్
ప్రభుత్వం చొరవ తీసుకోవాలి
గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలోని, చెరువు ఆయకట్టు కింద రైతులు సాగునీరు అందక నానా అవస్థలు పడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం నిరుపయోగంగా ఉన్న ఎత్తిపోతల పథకాన్ని ఉపయోగంలోకి తీసుకొచ్చి రైతులకు సాగునీరు అందించాలి.
– మద్దుకూరి సత్యనారాయణ, రైతు, ఈస్ట్ యడవల్లి

మెట్ట ప్రాంత రైతులను ఆదుకోవాలి