
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 2వ తేదీన ఫ్యాప్టో ఆధ్వర్యంలో తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఫ్యాప్టో నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక పవర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో ధర్నా సన్మాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయులను బోధనకు మాత్రమే పరిమితం చేయాలని, ఉద్యోగ ఉపాధ్యాయుల బకాయిలను వెంటనే చెల్లించాలని, 12వ పీఆర్‌సీ కమిషన్ ఏర్పాటు చేయాలని తదితర 18 డిమాండ్లతో ధర్నా తలపెట్టినట్టు చెప్పారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద ఆగస్టు 2న నిర్వహించే ధర్నా కార్యక్రమంలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఫ్యాప్టో చైర్మన్ జీ.మోహన్, సెక్రటరీ జనరల్ ఎం.ఆదినారాయణ, కో చైర్మన్ జి.వెంకటేశ్వరరావు, జి. ప్రకాష్‌రావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ కె.రవికుమార్, పవన్ కుమార్, సీహెచ్ శివరాం, ఐ.రమేష్, టి.రామరావు కార్యవర్గ సభ్యులు కె.కాంతారావు, ఈ.రామ్మోహన్, ఎన్.ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.