
పరిహారం లేదు
సంక్షేమ బోర్డు అమల్లో ఉంటే ఏదైనా అనుకోని సందర్భాల్లో ప్రమాదాలు జరిగితే రూ.30 వేల వరకు పరిహారం చెల్లించేవారు. ప్రస్తుతం బోర్డు అందుబాటులో లేకపోవడంతో తాపీ కార్మికులకు ఎలాంటి సహాయ, సహాకారాలు అందడం లేదు.
– పుప్పాల భాస్కరరావు,
తాపీ మేస్త్రి, దోసపాడు, దెందులూరు మండలం
క్‌లైయిమ్‌లు పరిష్కరించాలి
సంక్షేమ బోర్డు అమలులో లేకపోవడం వల్ల జిల్లాలో వేల కొద్దీ క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. రెండేళ్ల క్రితం నా కుమార్తె డెలివరీ నిమిత్తం బోర్డు నుంచి డబ్బులు రావాల్సి ఉంది. అప్పటి నుంచి పెండింగ్‌లో ఉంది. సంక్షేమ బోర్డును తక్షణం పునరుద్ధరించి పెండింగ్‌లో ఉన్న క్‌లైయిమ్‌లు వెంటనే పరిష్కరించాలి.
సొంగ రంగారావు, సెంట్రింగ్ కార్మికుడు, ఏలూరు
బోర్డును పునరుద్ధరించాలి
సంక్షేమ బోర్డును తక్షణం పునరుద్దరించాలి. బోర్డును పునరుద్దరించకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లు కూటమి ప్రభుత్వం తక్షణం సంక్షేమ బోర్డును పునరుద్ధరించి పెండింగ్ క్‌లైయిమ్‌లు పరిష్కరించాలి. కార్మికులను ఆదుకోవాలి.
– పి.కిషోర్, ఏఐటీయూసీ జిల్లా నాయకుడు, ఏలూరు
పోరు బాట పడతాం
సంక్షేమ బోర్డును పునరుద్ధరించేంత వరకు కార్మికుల పక్షాన పోరు బాట పడతాం. ఇప్పటికే కార్మిక శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులకు అనేక సార్లు వినతులు అందజేశాం. కార్మికుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి చిత్త శుద్ది ఉంటే తక్షణం సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి.
– బద్దా వెంకట్రావు, ఇఫ్టూ జిల్లా ప్రధానకార్యదర్శి
●

పరిహారం లేదు

పరిహారం లేదు

పరిహారం లేదు