సుముహూర్తాల శ్రావణం | - | Sakshi
Sakshi News home page

సుముహూర్తాల శ్రావణం

Jul 21 2025 5:35 AM | Updated on Jul 21 2025 5:35 AM

సుముహ

సుముహూర్తాల శ్రావణం

ముహూర్తాలు ఇలా..

శ్రావణమాసం మొదలైన మరుసటి రోజు నుంచి సుముహూర్తాలు మొదలు కానున్నా యి. జూలై 26, 30, 31, ఆగస్టు 1, 3, 5, 6, 7, 8, 9, 10, 12, 13, 14, 17, సెప్టెంబర్‌ 23, 24, 26, 27, 28, అక్టోబర్‌ 1, 2, 3, 4, 7, 8, 10, 11, 12, 16, 17, 22, 23, 24, 26, 28, 29, 30, 31, నవంబర్‌ 1, 2, 4, 7, 12, 13, 14, 15, 22, 23, 25, 26, 27 తేదీల్లో సుమూహూర్తాలు ఉన్నాయి.

ద్వారకాతిరుమల: శ్రావణమాసం వచ్చేస్తోంది. పెళ్లికళ తెచ్చేస్తోంది. ఈనెల 25 నుంచి శ్రావణమాసం ప్రారంభం కానుండగా, 26 నుంచి వివాహాది శుభకార్యాలు మొదలుకానున్నాయి. ఈ ఏడాది గురు మూఢమి, ఆషాఢ మాసం కావడంతో జూన్‌ 10 నుంచి 48 రోజుల పాటు శుభకార్యాలకు బ్రేక్‌ పడింది. దాంతో పెళ్లిబాజాలు మోగక కల్యాణ మండపాలు కళ తప్పాయి. శుభకార్యాలపై ఆధారపడ్డ వ్యాపార దుకాణాలు వెలవెలబోయాయి. అయితే ఈనెల 26 నుంచి సుముహూర్తాలు ప్రారంభం కానుండటంతో వ్యాపారులు మళ్లీ బిజీ కాను న్నారు. ఇప్పటికే పెళ్లిళ్లు కుదుర్చుకున్న వారు తమ పిల్లల వివాహాలను ఈ ముహూర్తాల్లోనే అట్టహాసంగా జరిపించాలని భావిస్తున్నారు.

శ్రీవారి క్షేత్రంలో ఆల్‌ ఫుల్‌

గురు మూఢమి, ఆషాఢ మాసం కావడంతో వివా హాలు, శంకుస్థాపనలు, గృహ ప్రవేశాలు, నూతన వ్యాపారాల ప్రారంభం, రిజిస్ట్రేషన్లు, నామకరణలు ఇతర శుభకార్యాలన్నింటికీ బ్రేక్‌ పడింది. శ్రావణమాసంలో ఆయా శుభకార్యాలకు పలువురు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రంలో భారీగా వివాహాలు జరుగనున్నాయి. ప్రధానంగా ఆగస్టు 9, 13, 14 తేదీల్లో ఎక్కువ వివాహాలు జరుగనున్నాయని పండితులు చెబుతున్నారు. దీంతో ఇప్పటికే క్షేత్రంలో కల్యాణ మండపాలు, సత్రాల్లోని గదులు, కాటేజీలు అన్నీ బుక్‌ అయిపోయాయి.

వ్యాపారులకు ఊరట

48 రోజుల పాటు వివాహ ముహూర్తాలు లేకపోవడంతో ప్రధానంగా పెళ్లిళ్లపై ఆధారపడి వ్యాపారాలు సాగిస్తున్న వస్త్ర, నగల దుకాణాలు, కల్యాణ మండపాలు వెలవెలబోయాయి. పెళ్లి తంతు సాగించే పురోహితులు ఖాళీగా ఉన్నారు. అలాగే కేటరింగ్‌, భోజనాల తయారీ వారు, డెకరేషన్‌, వీడియో, ఫొటోగ్రాఫర్లు డీలా పడ్డారు. శ్రావణమాసం రానుండటం వీరికి ఊరట కలిగిస్తోంది.

పెళ్లి కళ వచ్చేసిందే బాలా

ఈనెల 25 నుంచి శ్రావణమాసం

26 నుంచి సుముహూర్తాలు

ద్వారకాతిరుమల క్షేత్రంలో ఆల్‌ ఫుల్‌

భారీగా వివాహాలు

శ్రావణమాసంలో పెళ్లిళ్లు భారీగా జరుగనున్నాయి. నవంబర్‌ 27 వరకు ఉన్న సుముహూర్తాల్లో వివాహాది శుభకార్యాలు జరుపుకునేందుకు అంతా సిద్ధమవుతున్నారు. ద్వారకాతిరుమల క్షేత్రంలో వేలాదిగా వివాహాలు జరుగనున్నాయి. పెళ్లివారు ముందుగా ఏర్పాట్లు చేసుకోకుంటే ఇబ్బంది పడతారు.

– గోవిందవఝుల వెంకటరమణమూర్తి శర్మ, పురోహితులు, ద్వారకాతిరుమల

48 రోజులుగా ఖాళీగా..

వివాహ ముహూర్తాలు లేక కేటరింగ్‌ వ్యాపారులు 48 రోజులుగా ఖాళీగా ఉన్నారు. అలాగే కల్యాణ మండపాల యజమానులు, పచ్చిపూల మండపాలు వేసేవారు, పురోహితులు అంతా ఇబ్బంది పడ్డారు. ఈనెల 26 నుంచి నవంబర్‌ 27 వరకు సుముహూర్తాలు ఉన్నాయి. వ్యాపారాలు బాగా జరుగుతాయని ఆశిస్తున్నాం.

–ఇమ్మడి నాగు, కేటరింగ్‌ వ్యాపారి, ద్వారకాతిరుమల

సుముహూర్తాల శ్రావణం 1
1/2

సుముహూర్తాల శ్రావణం

సుముహూర్తాల శ్రావణం 2
2/2

సుముహూర్తాల శ్రావణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement