
ఉంగుటూరు బస్టాండ్‌లో బస్సుల నిలుపుదల
ఉంగుటూరు: ‘బస్టాండు ఇక్కడ–బస్సులు ఆపేది అక్కడ’ శీర్షినన ‘సాక్షి’లో ఆదివారం ప్రచురించిన కథనానికి ఆర్టీసీ అధికారులు స్పందించారు. తణుకు డిపో మేనేజర్, తాడేపల్లిగూడెం డిపో ఇన్‌చార్జి డీఎంగా వ్యవహరిస్తున్న సప్పా గిరిధర్‌కుమార్, తణుకు సీఐ మురళీ, తాడేపల్లిగూడెం సీఐ ఎల్.సుధారాణి ఉంగుటూరు వచ్చారు. బస్టాండ్‌లో నిద్రిస్తున్న బిచ్చగాళ్లను పోలీసుల సాయంతో అక్కడి నుంచి వేరే చోటుకు పంపించారు. బస్టాండ్‌లోనే బ స్సులను నిలుపుదల చేయించారు. డీఎం గిరిధర్‌కుమార్ మాట్లాడుతూ ఇక నుంచి బస్టాండ్ వద్దనే బస్సులు ఆపేలా చర్యలు తీసుకుంటా మని చెప్పారు. వారం పాటు కంట్రోలర్లు ఉంగుటూరులోని ఉండి బస్టాండ్ వద్దనే బస్సులు ఆపేలా డ్యూటీలు వేస్తామని చెప్పారు.
ఏడో రోజుకు ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె
నూజివీడు: తమ న్యాయమైన డిమాండ్ల సాధ న కోసం నూజవీడు మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ ఇంజినీరింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె ఆదివారం ఏడో రోజుకు చేరింది. మున్సిపల్ కార్యాలయం గేటు వద్ద నిర్వహిస్తున్న రిలే దీక్షల్లో యూనియన్ అధ్యక్షుడు ఎదురేసి అప్పారావు మాట్లాడుతూ మున్సిపల్ ఇంజినీరింగ్ సిబ్బందికి ఏడేళ్లుగా జీతాలు పెంచకుండా శ్ర మదోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదని, కార్మికుల సమస్యలపై ప్రభు త్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. కార్మికులకు వేతనాలు పెంచాలని కాంట్రాక్ట్, ఔట్ సో ర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, సంక్షేమ పథకాలు, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇవ్వా లని డిమాండ్ చేశారు. నాయకులు లటికే రంగారావు, రామారావు తదితరులు పాల్గొన్నారు.
27 నుంచి డిపార్ట్‌మెంటల్ పరీక్షలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన డిపార్ట్‌మెంటల్ పరీక్షలు ఈనెల 27 నుంచి నిర్వహించనున్నారని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు పువ్వుల ఆంజనేయులు ప్రకటనలో తెలిపారు. పరీక్షలను రా ష్ట్రంలోని 18 జిల్లాల్లో నిర్వహించనున్నారని, ఆ గస్టు 1 వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. మొత్తం 41,418 మంది ఉద్యోగులు పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. హాల్‌టికెట్లు ఈనెల 22 నుంచి ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.