మీటర్‌ రీడర్లపై స్మార్ట్‌ కత్తి | - | Sakshi
Sakshi News home page

మీటర్‌ రీడర్లపై స్మార్ట్‌ కత్తి

Jul 21 2025 5:35 AM | Updated on Jul 21 2025 5:35 AM

మీటర్

మీటర్‌ రీడర్లపై స్మార్ట్‌ కత్తి

స్పందన

8లో

సోమవారం శ్రీ 21 శ్రీ జూలై శ్రీ 2025

ఉద్యోగ భద్రత కల్పించాలి

విద్యుత్‌ మీటర్‌ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. 20 ఏళ్లకు పైగా పనిచేస్తున్నవారు చాలా మంది ఉన్నారు. వీరంతా మీటర్‌కు ఇంత రేటు చొప్పున వేతనం పొందుతున్నారు. ఇప్పటివరకూ వీరు ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది గానే ఉన్నారు. చాలీచాలని ఆదాయంతోనే కుటుంబాలను నెట్టుకొస్తున్నారు.

– రెడ్డి శ్రీనివాస డాంగే, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు, ఏలూరు

రెగ్యులరైజ్‌ చేయాలి

మీటర్‌ రీడర్ల సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేయాలి. సీనియార్టీ, అర్హతలను బట్టి విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలు ఇవ్వాలి. కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్న రీడర్లకు ఇప్పటికీ ఉద్యోగ రక్షణ లేదు. ఇలాంటి చిరు ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి.

– పి.కిషోర్‌, విద్యుత్‌ మీటర్‌ రీడర్ల సంఘ నాయకుడు, ఏలూరు

తక్కువ వేతనాలతో..

నెలకు కనీసం రూ.15 వేలు కూడా రావడం లేదు. ఏరియాను బట్టి మీటర్‌ రీడర్‌ నెలకు 2 వేల నుంచి 4 వేల మీటర్లను రీడింగ్‌ తీయ గలరు. 5 వేల మీటర్లకు రీ డింగ్‌ తీసేవారు కూడా ఉన్నారు. అన్ని ఖర్చులు పోనూ ఒక్కో మీటర్‌కు రూ.3.10 చెల్లిస్తున్నారు. నాకు రూ.15 వేలు కూడా రావడం లేదు.

– కంది మురళీబాబు, విద్యుత్‌ మీటర్‌ రీడర్‌, ఏలూరు

అర్హతను బట్టి ఉద్యోగం ఇవ్వాలి

విద్యుత్‌ మీటర్‌ రీడర్‌గా పనిచేస్తున్న మాకు విద్యార్హతను బట్టి రెగ్యులర్‌ ఉద్యోగం ఇవ్వాలి. మాలో విద్యార్హతలు ఉన్నవారు కూడా ఉన్నారు. చాలీచాలనీ రాబడితో కుటుంబాలను నెట్టుకురావడం చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పటికై నా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మాపై సానుకూల నిర్ణయం తీసుకోవాలి.

– ఎస్‌.శివరామకృష్ణ, విద్యుత్‌ మీటర్‌ రీడర్‌, ఏలూరు

ఏలూరు (టూటౌన్‌): చాలీచాలని వేతనాలతో బతుకుతున్న విద్యుత్‌ మీటర్‌ రీడర్లకు స్మార్ట్‌ మీటర్ల షాక్‌ తగలనుంది. ప్రభుత్వం స్మార్ట్‌ మీటర్లు తీసుకువస్తున్న నేపథ్యంలో తాము ఉపాధి కోల్పోయే ప్రమాదముందని వీరంతా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ భద్రత కల్పించాలంటూ, తమ సర్వీసులను రెగ్యులరైజ్‌ చేయాలని, ఉపాధి కోల్పోయే క్రమంలో ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలంటూ వీరంతా గళమెత్తుతున్నారు. 20 ఏళ్లుగా విద్యుత్‌ శాఖలో ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న తమకు న్యాయం చేయాలంటూ నినదిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని విద్యుత్‌ మీటర్‌ రీడర్ల సంఘ నాయకులు సోమవారం చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఏలూరు, పశ్చిమగోదా వరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున మీటర్‌ రీడర్లు వి జయవాడ వెళ్లేందుకు సన్నాహాలు చేశారు. కూటమి ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రధాన డిమాండ్లు

● స్మార్ట్‌ మీటర్లు వచ్చిన నేపథ్యంలో మీటర్‌ రీడర్లకు విద్యుత్‌ శాఖలోనే ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి.

● విద్యుత్‌ మీటర్‌ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి.

● కనీస వేతనాలు అమలు చేయాలి.

● రీడర్ల విద్యార్హతను బట్టి విద్యుత్‌ శాఖలో టెక్నికల్‌, నాన్‌టెక్నికల్‌ షిఫ్ట్‌ ఆపరేటర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, మిగిలిన వారిని వాచ్‌మెన్‌, అటెండర్‌ పోస్టుల్లో నియమించాలి.

● ఎస్‌క్రో ఖాతాను వెంటనే తెరవాలి.

● విద్యుత్‌ మీటర్‌ రీడర్లు కాంట్రాక్లర్లతో, విద్యుత్‌ శాఖ అధికారులతో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి.

న్యూస్‌రీల్‌

తిరగని బతుకు మీటర్‌

స్మార్ట్‌ మీటర్లతో ఉపాధికి గండి

ఉద్యోగ భద్రతకు డిమాండ్‌

సర్వీసులు రెగ్యులరైజ్‌ చేయాలని వినతి

విద్యుత్‌ శాఖలో ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలంటూ వేడుకోలు

నేడు మీటర్ల రీడర్ల ‘చలో విజయవాడ ’

ఉమ్మడి జిల్లాలో 860 మంది..

ఏలూరు జిల్లాలో సుమారు 460 మంది, పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 400 మంది మీటర్‌ రీడర్లు పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది పదేళ్లకు పైగా అనుభవం ఉన్నవారే. ఒక్క ఏలూరు కార్పొరేషన్‌ పరిధిలోనే సుమారు 30 మంది రీడర్లు ఉన్నారు. వీరు కార్పొరేషన్‌ పరిధిలోని 50 డివిజన్లలో ప్రతినెలా 1 నుంచి 11వ తేదీలోపు మీటర్‌ రీడింగ్‌ తీస్తుంటారు. ఒక్కో మీటర్‌కు రీడింగ్‌ తీసినందుకు విద్యుత్‌ శాఖ సంబంధిత కాంట్రాక్టర్‌కు రూ.6 నుంచి రూ.7 వరకు చెల్లిస్తోంది. మెషీన్‌ చార్జీలు, ఫోన్‌ రీచార్జి, రోల్స్‌, మరమ్మతులు, ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌ కటింగ్‌లు పోను విద్యుత్‌ మీటర్‌ రీడర్‌ చేతికి వచ్చేది ఒక్కో మీటర్‌ రీడింగ్‌కు రూ.3.10 మాత్రమే. సగటున ఒక్కో మీటర్‌ రీడర్‌ నెలకు 3 వేల మీటర్ల వరకు రీడింగ్‌ తీయగలరు. ఈ లెక్కన వీరి ఆదాయం నెలకు రూ.10 వేల లోపే. ప్రాంతాన్ని బట్టి రీడింగ్‌ సామర్థ్యం మారుతుంది.

మీటర్‌ రీడర్లపై స్మార్ట్‌ కత్తి 1
1/6

మీటర్‌ రీడర్లపై స్మార్ట్‌ కత్తి

మీటర్‌ రీడర్లపై స్మార్ట్‌ కత్తి 2
2/6

మీటర్‌ రీడర్లపై స్మార్ట్‌ కత్తి

మీటర్‌ రీడర్లపై స్మార్ట్‌ కత్తి 3
3/6

మీటర్‌ రీడర్లపై స్మార్ట్‌ కత్తి

మీటర్‌ రీడర్లపై స్మార్ట్‌ కత్తి 4
4/6

మీటర్‌ రీడర్లపై స్మార్ట్‌ కత్తి

మీటర్‌ రీడర్లపై స్మార్ట్‌ కత్తి 5
5/6

మీటర్‌ రీడర్లపై స్మార్ట్‌ కత్తి

మీటర్‌ రీడర్లపై స్మార్ట్‌ కత్తి 6
6/6

మీటర్‌ రీడర్లపై స్మార్ట్‌ కత్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement