
పారిజాతగిరిలో పూజలు
జంగారెడ్డిగూడెం: గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో శనివారం వేకువజాము నుంచే సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థప్రసాద గోష్టి, బాల భోగ నివేదన తదితర పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు జిల్లా నలుమూలల నుంచి కొండ పైకివచ్చి స్వామివారి ప్రత్యేక అష్టోత్తర పూజలు జరిపించుకున్నారు.
కుమార్తెలతో మహిళ అదృశ్యం
ఉండి: ఓ తల్లి ఇద్దరు బిడ్డలతో అదృశ్యం కావ
డంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం పెదపుల్లేరు గ్రామానికి చెందిన ఓ మహిళ భర్తతో విభేదాల కారణంగా తల్లి వద్ద ఉంటుంది. ఆమెకు 12, 8 ఏళ్ల వయసున్న కుమార్తెలు వున్నారు. ఈ నెల 18న ఇద్దరు కుమార్తెలతో నిద్రపోయిన ఆమె 19న ఉదయం 5 గంటల సమయంలో తల్లి చూసేసరికి కనిపించలేదు. దీంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కాల్వలో గుర్తుతెలియని మృతదేహం
కలిదిండి(కై కలూరు): గుడ్లవల్లేరు – కోరుకొల్లు బీఎండీ చానల్ కాల్వలో కోరుకొల్లు బ్రహ్మంగారి గుడి సమీపంలో గుర్తుతెలియని శవం శనివారం కొట్టుకొచ్చింది. సుమారు 35 నుంచి 40 ఏళ్ల వయస్సు, 5 అడుగుల ఎత్తు కలిగిన మగ శవంగా గుర్తించారు. మనిషి సన్నగా కనిపిస్తూ గెడ్డం, జుట్టు, కొనతేలిన మీసాలు ఉన్నాయి. రెండు రోజుల క్రితం మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తోన్నారు.
ఉండిలో మరొకటి..
ఉండి: శనివారం ఉండి బొండాడ మేజర్ డ్రెయిన్‌లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై ఎండీ నసీరుల్లా తెలిపారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పురుషుడి వయసు 40 నుంచి 50 ఏళ్ళు ఉంటుందని, ఆచూకీ కొరకు 9440796648 నెంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.
మంచినీటి చెరువును పరిశీలించిన అధికారులు
కాళ్ల: కాళ్ల మండలం కోలనపల్లి మంచినీటి చెరువును అధికారులు శనివారం పరిశీలించారు. చెరువులో చేపలు చనిపోవడంపై గ్రామస్తుల ఆందోళనపై ‘మంచినీటి చెరువులో చేపల మృతి’ అనే సాక్షి కథనానికి స్పందించారు. డిప్యూటీ ఎంపీడీవో భాస్కరరావు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చెరువును పరిశీలించారు. తేలుతున్న చేపలను తీసివేసి, గట్ల చుట్టూ పెరిగిపోయిన చెత్తను తొలగించినట్లు తెలిపారు. చెరువును బ్లీచింగ్‌తో సూపర్ శానిటేషన్ చేయించామని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని టాంటాం వేయించామన్నారు. కాళ్ళ లంక చానల్ నుంచి పంట నీరు నింపాలని అధికారులకు ఆదేశించారు.