ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌ దారుణం | - | Sakshi
Sakshi News home page

ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌ దారుణం

Jul 20 2025 1:55 PM | Updated on Jul 20 2025 2:45 PM

ఎంపీ

ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌ దారుణం

మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు

బుట్టాయగూడెం: ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌ ను మాజీ ఎమ్మెల్యే తె ల్లం బాలరాజు తీవ్రంగా ఖండించారు. శనివారం రాత్రి బాలరా జు విలేకరులతో మా ట్లాడుతూ ఎంపీ మిథున్‌రెడ్డిని సీఎం చంద్రబాబు కేవలం కక్షపూరిత రాజకీయాలతోనే అరెస్ట్‌ చేయించారని వి మర్శించారు. చంద్రబాబు రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులను టార్గెట్‌ చేస్తూ జైలులో పెట్టాలని చూ స్తున్నారన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎంత మందిని అరెస్ట్‌ చేసినా వైఎస్సార్‌సీపీ జెండాను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజాకోర్టులో చావు దెబ్బతప్ప దని బాలరాజు అన్నారు. లిక్కర్‌ కేసులో మిథు న్‌రెడ్డికి సంబంధం ఉన్నట్టు ఎక్కడా ఆధారం లేకపోయినా అరెస్ట్‌ చేయించారన్నారు.

ప్లాస్టిక్‌ను పారదోలాలి

ఉంగుటూరు : పారిశుద్ధ్యంలో ఏలూరు జిల్లా ను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపాలని, ప్లాస్టిక్‌రహిత జిల్లా లక్ష్యమని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి అన్నారు. శనివారం మండలంలోని చేబ్రోలులో పారిశుద్ధ్యంపై అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం, ఉర్దూ పాఠశాల, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ చేబ్రోలును తాను దత్తత తీసుకుంటానని, దేశంలోనే ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్లాస్టిక్‌ నిషేధానికి అందరూ సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ చేబ్రోలు జాతీయస్థాయిలో ఉత్తమ పారిశుద్ధ్య గ్రామంగా అవార్డు అందుకోవడం అభినందనీయమన్నారు. డీపీఓ కె.అనురాధ, ఎంపీడీఓ రాజ్‌మనోజ్‌, తహసీల్దార్‌ పూర్ణచంద్రప్రసాద్‌, సర్పంచ్‌ రందే లక్ష్మీసునీత తదితరులు పాల్గొన్నారు.

నకిలీ ఎరువులపై నిఘా

భీమడోలు: ఖరీఫ్‌లో నకిలీ ఎరువులు, పురుగు మందుల అమ్మకాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్‌ కే సులు నమోదు చేయాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. గుండుగొలనులోని సాయిలలితాంబికా ఎరువులు, పురుగు మందుల దుకాణాన్ని శనివారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. రిజిస్టర్లను పరిశీలించి స్టాకు నిల్వలను అడిగి తెలుసుకున్నారు. ఈ–పాస్‌ విధానం ద్వారా రైతులకు ఎరువులు విక్రయిస్తున్నట్టు జిల్లా వ్య వసాయాధికారి హాబీబ్‌ బాషా ఆమెకు వివరించారు. జిల్లాలో ఎరువుల నిల్వలు మెండుగా ఉన్నాయని కలెక్టర్‌ అన్నారు. రైతులు పురుగు మందులు, ఎరువులు విచక్షణారహితంగా వా డకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ ఏడీఏ పి.ఉషారాజకుమారి, ఏఓ ఎస్‌పీవీ ఉషారాణి ఉన్నారు.

విద్యుత్‌ మీటర్‌ రీడర్లకు

ఉద్యోగ భద్రత కల్పించాలి

ఏలూరు (టూటౌన్‌): విద్యుత్‌ మీటర్‌ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించి, విద్యుత్‌ సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించాలంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈనెల 21న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా నాయకుడు పి.కిషోర్‌ పిలుపునిచ్చారు. స్థానిక స్ఫూర్తి భవనంలో శనివారం చలో విజయవాడ పోస్టర్లను ఆవిష్కరించారు. విద్యుత్‌ మీటర్‌ రీడర్ల సంఘ నాయకులు కిషోర్‌, పి.ప్రకాష్‌, శంకర్‌, అప్పారావు మాట్లాడుతూ స్మార్ట్‌ మీటర్లతో రీడర్లు ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. వారి విద్యార్హతను బట్టి షిఫ్ట్‌ ఆపరేటర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, వాచ్‌మెన్‌, అటెండర్‌ పోస్టుల్లో నియమించాలని కోరారు. ఎస్‌క్రో ఖాతాను ప్రారంభించాలని, కనీస వేతనాలు అమలు చేయా లని డిమాండ్‌ చేశారు. ఆయా డిమాండ్ల సాధనకు 21న విజయవాడలో విద్యుత్‌ సౌదా వద్ద మహాధర్నా నిర్వహించనున్నామన్నారు. మీట ర్‌ రీడర్లు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలు పునిచ్చారు. ఏఐటీయూసీ నాయకులు బి.జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌ దారుణం 1
1/2

ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌ దారుణం

ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌ దారుణం 2
2/2

ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌ దారుణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement