కూటమి వంచనపై నిలదీద్దాం | - | Sakshi
Sakshi News home page

కూటమి వంచనపై నిలదీద్దాం

Jul 7 2025 6:16 AM | Updated on Jul 7 2025 6:16 AM

కూటమి

కూటమి వంచనపై నిలదీద్దాం

నూజివీడు : ఎన్నికల ముందు సూపర్‌సిక్స్‌ అని చె ప్పి అధికారం చేపట్టాక సూపర్‌సిక్స్‌ను పక్కన పెట్టి ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని నిలదీసేలా ప్రజలను చైతన్యవంతులను చేయాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నూజివీడు నియోజకవర్గ ఇన్‌చార్జి మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ అనే అంశంపై నియోజకవర్గస్థాయి విస్తృత స్థాయి సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప్‌ అప్పారావు మాట్లాడుతూ ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయకుండా కల్లబొల్లి మాటలు చెబుతోందన్నారు. ఏడాదిలో రూ.1.50 లక్షల కో ట్లు అప్పుచేసిన చంద్రబాబు ఈ సొమ్మును ఎక్కడ ఖర్చు చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, రూ.1,500 ఆడబిడ్డ నిధి ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. రైతులకు అన్నదాత సుఖీభవ సాయం, మహిళలకు ఉచిత బస్సు ఎప్పుడని నిలదీశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోరాటంతో విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం అమలు చేసిందని, లేకపోతే అది కూడా ఉండేది కాదన్నారు. రూ.10 వేలు జీతం అంటూ వలంటీర్లను నమ్మించి వెన్నుపోటు పొడిచారన్నారు. రేషన్‌ వాహనాలు తొలగించి మహిళలకు కష్టాలు తెచ్చిపెట్టారన్నారు.

నూజివీడు ప్రజల సంక్షేమం కోసమే..

నూజివీడు ఏరియా ఆసుపత్రిని రూ.21 కోట్లతో అభివృద్ధి చేస్తే దానిని ఉపయోగించడం కూడా ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదని మాజీ ప్రతాప్‌ అప్పారావు అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే జిల్లా ఆసుపత్రిగా మారుస్తామన్నారు. నూజివీడులో కేంద్రీయ విద్యాలయం కోసం మూడేళ్లు కష్టపడి మంజూరు చేయిస్తూ కూటమి ప్రభుత్వ పాలకులు ఇప్పటివరకూ దానిని ప్రారంభించలేకపోయారని మండిపడ్డారు. తాను గెలిచినా, ఓడినా నూజివీడు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సంక్షేమం కోసమే పనిచేస్తానన్నారు. మామిడి ధర పతనమై రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, ఎన్నడూ లేనివిధంగా కలెక్టర్‌ రకం టన్ను రూ.3 వేలకు, బంగినపల్లి రకం రూ.9 వేలకు పడిపోయిందన్నారు. కోత ఖర్చులు కూడా రావడం లేదని కలెక్టర్‌ రకం కాయలను కోయకుండా రైతులు తోటల్లోనే వదిలేశారన్నారు. ప్రభుత్వం టన్నుకు రూ.12 వేలు ఇస్తుందని చెబుతుందే తప్ప ఇప్పటివరకూ ఒక్క రైతుకూ ఇవ్వలేదని ప్రతాప్‌ అప్పారావు అన్నారు.

చంద్రబాబు పాలనంతా మోసమే

ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కారుమూరి సునీల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ చంద్రబాబు పాలనంతా మోసపూరితమేనని ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తా, నిలదీస్తా అని చెప్పిన పవన్‌కల్యాణ్‌ సినిమాలు తీసుకుంటున్నారే గాని రాష్ట్రంలోని ప్రజల బాధలు పట్టడం లేదన్నారు. 50 ఏళ్లకే ఎస్సీ,ఎస్టీ, బీసీలకు పింఛన్లు మంజూరు చేస్తామని ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీయాలని కోరారు.

ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం

ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాఽథ్‌ మాట్లాడుతూ హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. హామీలను అమలు చేయాలంటూ బాధ్యతాయుత ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వ మోసాలను వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. జెడ్పీ వైస్‌ చైర్మన్‌ గుడిమళ్ల కృష్ణంరాజు, జెడ్పీటీసీలు వరికూటి ప్రతాప్‌, పిన్నిబోయిన వీరబాబు, ఎంపీపీలు కొండా దుర్గాభవాని, గోళ్ల అనూష, వైఎస్సార్‌సీపీ పట్టణ, మండలాల అధ్యక్షులు శీలం రాము, పోలిమెట్ల శివ, బెజవాడ రాంబాబు, మూల్పూరి నాగవల్లేశ్వరరావు, పుచ్చకాయల సుబ్బారెడ్డి, సీనియర్‌ నాయకులు దేశిరెడ్డి రాఘవరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే

మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు

కూటమి వంచనపై నిలదీద్దాం 1
1/1

కూటమి వంచనపై నిలదీద్దాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement